నిర్మాతలను బ్లాక్ మెయిల్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో..?

Anilkumar
ఒక సినిమాను  చేసేముందు  ఎలాంటి హీరో అయినా ముందు కథ చూస్తారు.ఇక  ఆ తర్వాతే దర్శకుడు, నిర్మాత.. రెమ్యునరేషన్ చూస్తారు. కాగా కెరీర్‌లో ఎదగాలి.. మన హిట్ సినిమాలు పడాలి.అయితే రెమ్యునరేషన్ విషయంలో ఆ హీరో చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంటాడట.ఇక గతంలో ఐదారు ప్లాపులతో పూర్తిగా ఫేడవుట్ అయిపోయాడు.కాగా  ఆ తర్వాత హిట్ వచ్చిన ప్రతిసారి రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోయిన ఆ సీనియర్ హీరో ఇప్పుడు మరోసారి ఆ రేటు సవరించేశాడట. అయితే విచిత్రం ఏంటంటే ఇప్పుడు ప్లాపులు వస్తున్నా కూడా ప్రతి సినిమాకు రేటు పెంచుకుంటూ పోతూ నిర్మాతలను చివరకు బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి దిగజారిపోయాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ఆ హీరో నటించిన ఓ సినిమా ఈ యేడాది రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ అయ్యింది.ఇక  విచిత్రం ఏంటంటే ఆ సినిమాకు ముందు మాట్లాడుకున్న రెమ్యునరేషన్ కంటే మరో రు. 2 కోట్లు ఎక్కువ తీసుకున్నాడు. అయితే  తాజాగా ఆ హీరో నటిస్తోన్న మరో సినిమా కూడా సెడన్‌గా ఆగిపోయింది. కాగా సినిమా చాలా వరకు పూర్తయినా మనోడి రెమ్యునరేషన్ ఫుల్‌గా చేతికి అందలేదట.అయితే  ఇలాంటి టైంలో ఏ హీరో అయినా డబ్బింగ్ చెప్పడం ఆపేస్తారు. ఇకపోతే  ఈ హీరో మాత్రం డబ్బింగ్‌తో పాటు రెండు వారాల షూటింగ్ కూడా పెండింగ్‌లో పెట్టేశాడట.

ఇక  దీంతో ఇప్పుడు నిర్మాతలు ఆ హీరోతో సినిమా అంటేనే భయపడుతున్నారు.అయితే ఆ హీరోతో సినిమా అంటే గాల్లో దీపం పరిస్థితి మాదిరిగా తయారైంది.ఇక  దీంతో మనోడు ప్రస్తుతం నటిస్తోన్న సినిమా రిలీజ్ డేట్ కూడా వాయిదా వేసేశారు. ఇదిలావుండగా  నిర్మాతలు ఈ బాధలు పైకి చెప్పుకోలేరు కాబట్టే పోస్ట్ ప్రొడక్షన్ లేట్‌.. ఏదో సాకులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇకపోతే ఈ సీనియర్ హీరో మరో నాలుగేళ్ల తర్వాత తన కెరీర్ ముగిసినట్టే అని డిసైడ్ అయిపోయాడట.కాగా  అందుకే ఇప్పుడు ఉన్నంతలో పిండేయాలని గట్టిగా డిసైడ్ అయిపోయి విలువలను పక్కన పెట్టేశాడనే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: