ఏపీ: నిరూపిస్తే నామినేషన్ ఉపసంహరించుకుంటా: కాకాణి గోవర్ధన్ రెడ్డి

Suma Kallamadi
ఏపీలో ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పూర్తి కావడంతో ఇక అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో స్పీడుగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా నెల్లూరు జిల్లాలో హోరాహోరీగా టిడిపి వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం కొనసాగుతుంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి వర్సెస్ reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్న మాదిరి వార్ ఇక్కడ నడుస్తుంది. అవును, నెల్లూరు జిల్లాలో ఎన్నికల వేళ మందుబాబులకు విరివిగా పంచేందుకు భారీగా మద్యం డంప్ చేయించారని కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద తెలుగుదేశం ఆరోపించగా, ఈ విషయమై కాకాణి గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సోమిరెడ్డి చంద్ర మోహన్ కి ఓడిపోతాడేమోననే భయం అప్పుడే పట్టుకుంది. అందుకే నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని కాకాని ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడ మద్యం దొరికినా అది వైసిపి దేనని reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై బురద చల్లడం శోచనీయం కాదని ధ్వజమెత్తారు. ఓటమిని ముందుగానే అంగీకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని అన్నారు. గత ఎన్నికలలో ఎలక్షన్ కమిషనర్ చేసిన ఎఫ్ఐఆర్లో నా పేరు ఉందని చెబుతున్నారు... దమ్ముంటే సోమిరెడ్డి దీనిని నిరూపించగలరా అని కాకాని ఈ నేపథ్యంలో సవాల్ విసిరారు.
ఇంకా కాకాని మాట్లాడుతూ... "తక్షణమే బురద జల్లే పనులు మానుకోకుంటే త్వరలో ఎన్నికల్లో తుది తీర్పు ప్రజలే ఇస్తారు. సంస్కారంగా బతకడం సోమిరెడ్డికి ఏనాడూ లేదు. కనీసం జగన్ చూసి అయినా నేర్చుకోండి. ఎక్కడో మద్యం దొరికితే దాన్ని మాకు ఆపాదించడం తగదు. మీ బ్రతుకంతా అవినీతి మాయం. ఓటర్లకు డబ్బులు పంచుతున్న సోమిరెడ్డి ని డిస్ క్వాలిఫై చేయాలని ఈ సందర్భంగా ఈసీకి తాను ఫిర్యాదు చేస్తున్నాను." అని అన్నారు. ఇక ఎన్నికల్లో తాను ఏమి మాట్లాడాలో కూడా reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాగా పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు కనీసం 5000 మంది వచ్చారని నిరూపిస్తే నా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా... మీ పని అయిపోయింది! అంటూ విరుచుకు పడ్డారు కాకాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: