టాలీవుడ్ .. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అయితే మెగా డాటర్స్ కూడా ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు .ఇక ఈ మధ్య మెగా ఫ్యామిలీకి చెందిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా, చిరు కూతుర్ల పెళ్లీ, విడాకుల ఇష్యూస్‌పై అనేక వార్తలు వస్తుంటాయి.మెగా హీరోస్ ఇండస్ట్రీలోకి వచ్చి క్రేజ్ సంపాదించుకుంటే .. మెగా డాటర్స్ ఇండస్ట్రీలోకి రాకుండానే తండ్రి పేరును ఉపయోగించుకొని మంచి పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్నారు.తాజాగా ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మెగా డాటర్ సుస్మిత ఓ బడా ఇంటి స్టార్ కి కోడలు కావాల్సిందట . కానీ మెగాస్టార్ చిరంజీవిని ఆ పెళ్లి జరగకుండా అడ్డుకున్నారట. దానికి కారణం కూడా నెట్టింట వైరల్ గా మారింది . సుస్మితకు పెళ్లి వయసు రాగానే స్టార్ హీరో కొడుకుతో సుస్మితకు పెళ్లి చేయాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆ స్టార్ హీరో డిసైడ్ అయ్యారట . అనుకున్న విధంగానే ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకున్నారట.అయితే సుస్మిత కి అప్పట్లో మరొక స్టార్ యంగ్ హీరో అంటే ఇష్టం ఉన్న విషయం చిరంజీవికి తెలియదు . ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న చిరంజీవి .. కూతురి సంతోషం కోసం ఆ స్టార్ హీరోకి ఇచ్చిన మాటను రిజెక్ట్ చేశారట . అంతేకాదు అంతా మాట్లాడుకున్నాక పెళ్లిని క్యాన్సిల్ అనుకున్నారట. ఆశ్చర్యమేంటంటే ఆ తర్వాత సుస్మిత పెళ్లి చేసుకోవాలి అనుకున్న హీరో కూడా ఆమెకు హ్యాండ్ ఇచ్చాడు . ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది . అయితే ఫైనల్లీ కుటుంబ సభ్యులు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది సుస్మిత . మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్నాయి . ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో సుస్మిత పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.