జగన్: కూటమి ఊహలకే అందని నిర్ణయం..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులలో ఉత్సాహం కనిపిస్తోంది.. ముఖ్యంగా ఈసారి కచ్చితంగా ఎలాగైనా గెలవాలని ఉద్దేశంతోనే ప్రజలతో మమేకమవుతూ అభ్యర్థులు ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా టిడిపి వైసిపి పార్టీ మధ్య రసవత్తమైన పోరు జరుగుతోంది.. అటు జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ కూడా తమ తమ వ్యూహాలతో పలు రకాల సభలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే కొన్ని సభలను పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. జగన్ సిద్ధం సభతో పాటు మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రను కూడా ఇటీవల పూర్తి చేశారు.
ఇక నారా లోకేష్ కూడా గతంలో యువగళం పేరుతో ఒక యాత్ర చేసినప్పటికీ అది పెద్దగా కలిసి రాలేదు. పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర మొదలుపెట్టినప్పుడు బాగా పాపులారిటీ వచ్చిన ఆ తర్వాత చంద్రబాబుతో కలిసి పొత్తు పెట్టుకోవడంతో ఇది కూడా వర్కౌట్ కాలేదు.. దీంతో చంద్రబాబుతో కలిసి ప్రజాగళం యాత్రను మొదలుపెట్టి జనంలోకి వస్తున్నప్పటికీ చంద్రబాబు చెబుతున్నటువంటి మాటలు ప్రజలు పెడచెవ్విన పెట్టినట్టుగా కనిపిస్తోంది. బిజెపి నేతలు అయితే ప్రచారంలో ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కూటమిలో సమన్వయం లేక చాలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

 సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఏ స్థాయిలో కష్టపడ్డారో ఇప్పుడు అంతకుమించి మరి కష్టపడుతున్నారు. కేవలం సంక్షేమ పథకాల పైన పూర్తి స్థాయిలోనే నమ్మకం ఉంచి కూటమినీ ఎదుర్కొనే పనిలో పడ్డారు జగన్. మొదట సిద్ధం సభతో ప్రత్యర్థులని భయపెట్టిన జగన్ ఆ తర్వాత మేమంతా సిద్ధం సభతో ప్రజలలో ఉండేలా ప్లాన్ చేశారు. ఇప్పుడు మళ్లీ హెలిఫ్కార్టర్ తో పలు రకాలు నియోజకవర్గం చుట్టూ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.. ఇటీవలే నామినేషన్ కోసం పులివెందులకు వెళ్లిన జగన్ అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. పక్కా ప్రణాళికతోనే టూర్ షెడ్యూల్ ని సైతం విడుదల చేస్తే కూటమికి ఊహకందని విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళుతున్నారు. ఏ విషయాన్ని అయినా సరే ఒక్క రోజులోనే అందరితో చర్చించి ముందుకు వెళ్తుంటారు.ముఖ్యంగా ఎక్కడైతే నియోజకవర్గాలలో టైట్ ఫీట్ గా ఉంటుందో ఆ నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మరి కూటమినీ భయపెడుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: