ఏపీ: నారా లోకేశ్ హితవు... అధికారంలోకి రాగానే అమరావతి పనులు షురూ?

Suma Kallamadi
ఆంధ్రాలో ఎన్నికల వేళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేశ్ మంగళగిరి నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం విజయవంతంగా షురూ చేస్తున్నారు. ఇవాళ అనగా ఏప్రిల్ 26న ఆయన రచ్చబండ కార్యక్రమం అక్కడ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అయన ప్రసంగిస్తూ, మంగళగిరి నియోజక వర్గంలో తాను ఓడిపోయినప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని, తాను చేసిన సంక్షేమంలో 10 శాతమైనా గెలిచిన అధికార పార్టీ వైసీపీ వాళ్లు చేయగలిగారా? అంటూ స్థానికులను ప్రశ్నించారు. దాటికి వారు లేదని సమాధానం చెప్పగా లోకేష్, మరి ఆలోచించుకోండి.. అభివృద్ధి ఎవరితో జరుగుతుందో ఎవరితో కుంటు పడుతుందో అని వారికి సూచించారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... త్వరలో కూటమి అధికారంలోకి రాబోతోంది. అది రాసిపెట్టే వుంది. మేము రాగానే అమరావతి రాజధాని పనులు దిగ్విజయంగా పునః ప్రారంభిస్తామని వారికి మాటిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, "ఆనాటినుండే (2019) నుంచి అమరావతి పనులు ఇక్కడ కొనసాగించి ఉంటే ఈపాటికి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి. కానీ ఆ దౌర్భాగ్యుడు వచ్చి మన కొంపల్ని ముంచేశాడు. ఎంతైనా రౌడీ కదా. ఆ లక్షణాలు సింహాసనం పైన కూర్చుంటే మాత్రం పోతాయా?" అని నారా లోకేశ్ పేర్కొన్నారు. 2014లో అమరావతికి జగన్ సంపూర్ణ మద్దతు తెలిపి, అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు.
అంతేకాకుండా జగన్ ను ఒప్పిస్తానన్న స్థానిక ఎమ్మెల్యే ఆర్కే కూడా అనూహ్యంగా 3 రాజధానులకు మద్దతు ఇస్తూ ప్లేట్ మార్చేశాడు. నియంత పాలనలో ఇవి మామ్మూలే. అయితే మరి కొన్ని రోజుల్లో అంతా సద్దుమణుగుతుంది. రావణ రాజ్యం పోయి, రామ రాజ్యం రాబోతోంది.. మీరు నిశ్చింతగా ఉండండి. అబద్ధాలు చెప్పడంలో జగన్ అండ్ కో మాస్టర్స్ డిగ్రీ చేసారు. దళిత రైతులపైన అక్రమ కేసులు పెట్టారని లోకేశ్ విమర్శించారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అంటూ సభ ముగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: