ముల్లంగి వల్ల అందమే కాదు ఆరోగ్యం కూడా..?

Divya
మనకు దొరికేటువంటి కాయగూరలలో పలు రకాల దివ్యమైన ఔషధా గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.. ముఖ్యంగా ముల్లంగి కూడా ఒకటి.. ముల్లంగి తినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఇందు వల్ల కలిగేటువంటి లాభాలు తెలిస్తే ఖచ్చితంగా తినకుండా ఉండరు.. కిడ్నీలోని రాళ్ళను సైతం తొలగించడానికి ఈ ముల్లంగి చాలా ఉపయోగపడుతుందని వైద్యుల పరిశోధనలో కూడా తెలియజేశారు. కడుపులో లైనింగ్ ను బలోపేతం చేసి పేగును రక్షించడానికి చాలా ఉపయోగపడుతుంది ముల్లంగి..

ముల్లంగిలో విటమిన్ సి అనేది చాలా పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మానికి చాలా ముఖ్యము. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఇందులో ఉత్పత్తి అయ్యే  కొల్లాజెన్ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ముల్లంగి తినడం వల్ల ఎముకలు ఇతరత్రా బంధన కణజాలాలను నిర్మించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ముల్లంగిలో ఎక్కువగా పొటాషియం వంటి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటు సమతుల్యం కూడా చేయడంలో చాలా సహాయపడుతుందట. పొటాషియం ముల్లంగిలో ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటును సమర్థవంతంగా తగ్గిస్తుంది.

ముల్లంగిని ఎన్నో రకాలుగా అయినా మనం తినవచ్చు.. ముల్లంగి ఫ్రై.. లేకపోతే సాంబార్లో అయినా వేసుకోవచ్చు ముల్లంగి ఊరుగాయను కూడా చేసుకోవచ్చు.. ముల్లంగిని ఖాళీ కడుపుతో తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండేటువంటి పీచు పదార్థాలు మలబద్ధక సమస్యను కూడా నివారిస్తాయి.. ముల్లంగిని వారంలో రెండు మూడు రోజులైనా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుందట. ముల్లంగి ఆకులు కూడా జీర్ణక్రియ పైన ఎక్కువగా ప్రభావాన్ని చూపించేలా చేస్తాయి.

బరువు తగ్గాలనుకునే వారికి ముల్లంగి ఉత్తమమైనది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణమయ్య కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది. చాలా తక్కువ క్యాలరీలు కూడా కలిగి ఉంటుంది. ముల్లంగి రసం లోకి కాస్త ఉప్పును కలిపి తాగడం వల్ల పైల్స్ సమస్యను కూడా దూరం చేస్తుందట. ఇవే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు కూడా ముల్లంగిలో ఉన్నవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: