సర్కారు వారి పాట రగిల్చిన మెగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ రగడ !

Seetha Sailaja
సూపర్ స్టార్ మహేష్ బాబు వివాదాలకు అత్యంత దూరంగా ఉంటాడు. అయితే ‘సర్కారు వారి పాట’ అనవసరంగా మహేష్ ను వివాదాలలోకి తీసుకువెళుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈమూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈమూవీ కలక్షన్స్ బాగానే ఉన్నాయి అన్న నమ్మకంతో మహేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈమూవీ మొదటిరోజు 75 కోట్లు గ్రాస్ కలక్షన్స్ వసూలు చేసింది అని వార్తలు రావడంతో ఆ వార్తని ఆధారంగా చేసుకుని మహేష్ అభిమానులు ఈ కలక్షన్స్ ను హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు.

ఈమూవీ విడుదలకు రెండు వారాల ముందు విడుదలైన ‘ఆచార్య’ మూవీ కంటే తమ మూవీ కలక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి అని మహేష్ అభిమానులు హడావిడి చేస్తూ మహేష్ ముందు చిరంజీవి రామ్ చరణ్ లు వెలవెల పోయారు అన్న అర్థం వచ్చేలా ఒక ఘాటైన పదాన్ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి మెగా అభిమానులకు తీవ్ర అసహనాన్ని కల్గిస్తోంది.

వాస్తవానికి చిరంజీవి చరణ్ లతో మహేష్ కు చాల సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మహేష్ సినిమా ఫంక్షన్స్ కు అనేకసార్లు చిరంజీవి అతిధిగా కూడ వచ్చాడు. అలాంటి సాన్నిహిత్యం ఉన్న ఈ రెండు కుటుంబాల చిచ్చు పెట్టేలా మహేష్ వీరాభిమానుల అత్యుత్సాహం కనిపిస్తోంది.

వాస్తవానికి ‘ఆచార్య’ అంత భయంకరమైన నెగిటివ్ టాక్ ‘సర్కారు వారి పాట’ కు రాలేదు. దీనితో మహేష్ అభిమానులు సంబరపడుతున్నప్పటికీ ఈమూవీకి వచ్చిన డివైడ్ టాక్ వల్ల ఈమూవీ కలక్షన్స్ విషయంలో అంచనాలు అందుకోలేకపోవచ్చు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో డివైడ్ టాక్ వచ్చిన ఒక మూవీని విపరీతంగా హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో రగడ చేయడం అత్యుత్సాహమే అవుతుంది. ఈ పరిస్థితులలో మహేష్ వీరాభిమానులు ఇలాంటి అత్యుత్సాహంతో ఎందుకు ప్రవర్తిస్తున్నారు అన్న విషయం చాలామందికి అర్థంకాని విషయంగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: