లైవ్ లో.. తమన్నాకు ఎంతమంది ప్రపోజ్ చేసారో చూడండి?

praveen
మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈ అమ్మడి అందాలకు ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హాట్ హాట్ హాట్ అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. సీనియర్ హీరోయిన్ గా ముద్రపడిన ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి. 35 ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా ఫిట్నెస్ మెయిన్టెయిన్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన సినిమాలతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే మిల్కీబ్యూటీ అభిమానులు తమ అభిమాన హీరోయిన్ ని ఒక్కసారి కలిస్తే చాలు అని కోరుకుంటూ ఉంటారు. ఇక తమన్నాతో ఒక్క సెల్ఫీ దిగి తే చాలు అని ఎంతో ఆశ పడుతూ ఉంటారు. ఇలా చాలా మటుకు కుదరదు. ఎందుకంటే ఒకవేళ షూటింగ్ స్పాట్ కు వెళ్ళినా తమన్నా ని కలవడానికి అక్కడున్న సిబ్బంది అనుమతిస్తారా లేదా అన్నది కూడా తెలియని విషయమే. కానీ ఇక్కడ మాత్రం ఎంతో మంది అభిమానులకు తమన్నా ని నేరుగా దగ్గర నుంచి చూసే అవకాశం వచ్చింది. ఇక కొంతమంది ఏకంగా తన దగ్గరికి రెడ్ రోజ్ తీసుకువెళ్లి మోకాళ్ళపై కూర్చుని తమన్నా కళ్ళలోకి చూస్తూ ఎంతో ప్రేమగా ప్రపోజ్ చేసే అవకాశం కూడా వచ్చేసింది.


 ఇటీవలే అందరిముందే కొంతమంది కుర్రాళ్లు తమన్నా కి రెడ్ రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేశారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది అని అనుకుంటున్నారు కదా.. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో లో. ఎఫ్ 3 ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే చిత్రబృందం క్యాష్ షో లో కి గెస్ట్ లుగా వచ్చారు. తమన్నా, సోనాల్ చౌహాన్, సునీల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు.  ఈ క్రమంలోనే ఇక క్యాష్ షో లోకి వచ్చే కాలేజీ స్టూడెంట్స్ రెడ్ రోజ్ పట్టుకుని తమన్నా దగ్గరికి వెళ్లి ప్రపోజ్ చేశారు. దీంతో అందరి దగ్గర నుంచి రోస్ తీసుకుని తన క్యూట్ స్మైల్ తో  అందరిని మెస్మరైజ్ చేసింది తమన్నా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: