"ఎస్ ఎస్ రాజమౌళి" లాగా బిగ్ డైరెక్టర్ అవ్వాలంటే?

VAMSI
టాలీవుడ్ లో ఇప్పుడు అందరి నోటా పాన్ ఇండియా అనే మాటే వినిపిస్తోంది. ఒకపుడు తెలుగు సినిమానే హేళనగా చూసిన ఇండియన్ సినిమాకి తెలుగు సత్తా ఏమిటో మన దర్శకులు చూపిస్తున్నారు. అయితే ఈ క్రెడిట్ అంతా సినిమాలను చూసి ఇంత పెద్ద సక్సెస్ చేస్తున్న అభిమాన ప్రేక్షకులకే వెళుతుంది. ఎందుకంటే ఒక సినిమా హిట్ అవ్వాలంటే... కీలక పాత్ర ప్రేక్షకులదే అవుతుంది. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక కథను సినిమాగా మలిచే సందర్భంలో చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన కథలను వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిం ఇలా ఏదో ఒక రూపంలో ప్రేక్షకులకు చూపించి వెండితెర డైరెక్టర్ గా ఎదగాలని కలలు కంటున్నారు.
అయితే ఇక్కడ డైరెక్టర్ కావాలి అనుకునే ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుని, ఇండస్ట్రీలో ఉన్నంతకాలం గుర్తు పెట్టుకుని పాటించాలి. అప్పుడే మీరు ప్రేక్షకులకు మీరు అనుకున్న విధంగా సినిమా తీసి చూపించగలరు. మరి ఈ విషయాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
* ముందుగా మీరు డైరెక్టర్ గా అవ్వాలంటే ఒక మంచి కథను తయారుచేసుకోండి. అవకాశాల కోసం తిరగండి... అవకాశం వచ్చిన సమయంలో నిర్మాత లేదా హీరో మీ కథను వినాల్సి వచ్చినప్పుడు... ముందుగా  మీ సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్ ఏమిటో వారికీ అర్థమయ్యేలా వివరించండి. ఆ తర్వాతనే కథలోని మిగిలిన విషయాల గురించి చర్చించండి. అప్పుడే నిర్మాత లేదా హీరో కనెక్ట్ అవుతారు.
* కథలో మార్పులు చేయమని ఎంత పెద్ద నిర్మాత లేదా హీరో అడిగిన ససేమిరా ఆనంది. మోహోమతానికి పొయ్యి కథను మార్చారా అంతే సంగతులు..ఖచ్చితంగా ప్లాప్ అవుతుంది. దీనికి చాలా ఉదాహరణలు ఇండస్ట్రీలో ఉన్నాయి.
*  మీ కథ ఎలా ఉన్నా ఎప్పుడు రెడీ చేసుకున్నా ప్రస్తుతం ఉన్న సమాజానికి కనెక్ట్ అయ్యేలా... మార్పులు చెయ్యండి. సమాజానికి ఉపయోగపడే అంశాలను చొప్పించండి. అప్పుడే ప్రేక్షకులు మీ సినిమాకు కనెక్ట్ అవుతారు.
* తర్వాత ఒక సినిమా తీస్తున్నప్పుడు 100 శాతం ఎఫర్ట్ పెట్టండి. రిజల్ట్ ఏ విధంగా వస్తుంది ఏమవుతుంది అనేది ప్రేక్షక దేవుళ్ళకు వదిలేయండి.
ఇలా డైరెక్టర్ గా క్లిక్ అవ్వాలంటే పై విషయాలలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావొద్దు. అయ్యారా... దర్శకుడిగా ఫెయిల్ అవ్వడం పక్కా... మీరు ఒక రాజమౌళి లాగా అవ్వాలంటే ఇలాంటివి అన్నీ పాటించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: