సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సినిమా లతో పాటుగా యాడ్స్ తో కూడా ఎంతో మంది అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఎవరైనా స్టార్ హీరో ను ప్రమోట్ చేశారంటే.. ఆ ప్రొడక్ట్ జనాలలోకి బాగా దూసుకుపోతోంది. ఎన్ని కోట్లు ఖర్చు అయిన ప్పటికీ కూడా.. స్టార్ హీరోలు సైతం తమ ప్రోడక్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటూ ఉంటారు . ఇక టాలీవుడ్ తో పోల్చుకుంటే బాలీవుడ్ హీరోలు సైతం ఎక్కువ యాడ్లలో నటిస్తూ ఉంటారు. అలాంటి వారిలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఒకరు. పలు బ్రాండ్ సంస్థలకు చెందిన వాటికి బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తున్నారు.
అయితే ఇప్పుడు తాజాగా ఒక ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ నుంచి తప్పుకున్నట్లు గా తెలియజేశారు. గత కొద్దిరోజుల నుంచి అక్షయ్ కుమార్ పాన్ మసాలా కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. అక్షయ ఇలా టొబాకో బ్రాండెడ్ కు అంబాసిడర్ గా ఉన్నారు . అయితే ఇలా వున్న ఆయన అంటే అభిమానులకు నచ్చలేదు.. దీంతో ఆయనపై పలు రకాలుగా ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. దీంతో అభిమానుల నుంచి అనేక రిక్వెస్ట్ రావడంతో అజయ్ ఆ బ్రాండ్ నుంచి కొనసాగించనని తెలియజేశారు.
ఏప్రిల్ 21వ తేదీ సోషల్ మీడియా లో అక్షయ్ టొబాకో బ్రాండ్ నుంచి తప్పుకున్నట్లు గా తెలియజేశారు. అలాగే తన అభిమానులకు కూడా క్షమించమని తెలియజేశారు. ఇప్పటికే షారుఖ్ ఖాన్, అజయ్దేవగన్ వంటి స్టార్ హీరోలు సైతం పాన్ మసాలా కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవారు. ఇక ఇటీవలే అక్షయ్ కుమార్ పాన్ మసాలా వంటి కొన్ని బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరించడంతో ఒక్క సారిగా ఆయన పై వ్యతిరేకత మొదలైంది. దీంతో అక్షయ్ కుమార్ ఒక లేఖను కూడా షేర్ చేయడం జరిగింది. తనను ఎంతగానో ప్రేమించే అభిమానులకు శ్రేయోభిలాషులకు క్షమాపణలు తెలియజేస్తున్నాను.. ఇకమీదట ఇలాంటివి చెయ్యను అని ఒక లేఖ ద్వారా పోస్ట్ చేశారు అక్షయ్.