అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ స్థాయి పూర్తిగా పెంచిన సినిమా అది. ఆ చిత్రం తర్వాత నే అల్లు అర్జున్ సినిమాల ఎంపికలో చాలా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు కూడా ఆ స్థాయి సినిమాలనే చేయడానికి ముందుకు వెళుతున్నాడు. అందుకే పుష్ప సినిమా చేసి మర్చిపోలేని విజయాన్ని అందుకే ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే చిత్రాలన్నీ వరుసగా ఉన్నాయి.
ఆయన బాలీవుడ్ దర్శకులతో సినిమా చేస్తున్నాడు అని చెబుతుంటే కొంతమంది సౌత్ దర్శకులతో సినిమా చేస్తున్నాడు అని అంటున్నారు. ఆ విధంగా ఇప్పుడు మరొక కొత్త వార్త తెరపైకి వచ్చింది రేసుగుర్రం దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పవచ్చు. ఆ సినిమా తర్వాత వీరి కాంబో సినిమా కోసం ఇద్దరి అభిమానులు ఎంతో ఎదురుచూశారు. కానీ కుదరలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకు వీరి కాంబో సినిమా అంటే నిజంగా ఫుల్ మీల్స్ అని చెప్పాలి.
ప్రస్తుతం సురేందర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాలు పూర్తి చేసిన తర్వాత కానీ అల్లు అర్జున్ తో ఆయన చేతులు కలపడానికి లేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి చేసే సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందని వారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రేసుగుర్రం సినిమా లాంటి సినిమాకు మించిన సినిమా వీరు చేయాలని చెబుతున్నారు. మరి సురేందర్ రెడ్డి తన అభిమాన హీరో అల్లు అర్జున్ కోసం ఏ స్థాయి సినిమా రెడీ చేశాడో చూడాలి.