ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమా ముందు ఏ సినిమా కూడా నిలబడటం లేదు అని చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది ఆర్ ఆర్ ఆర్. హాలీవుడ్ మేకర్స్ ను సైతం తనవైపు తిప్పుకుంది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించగా భారీ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఆ విధంగా ఈ సినిమా విడుదల పది రోజులు కావస్తున్నా కూడా కలెక్షన్ల విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ఓ పెద్ద సినిమా ఆర్.ఆర్.ఆర్ సినిమా పై ప్రభావం చూపుతుందని అందరూ భావించారు. కానీ ఆ సినిమా ఓపెనింగ్ డే రోజునే ఆర్ఆర్ఆర్ సినిమా ను ఇబ్బంది పెట్టలేకపోయింది. జాన్ అబ్రహం మరియు రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఎటాక్ పెద్ద బడ్జెట్ తో తెరకెక్కగా ఈ శుక్రవారం సినిమా విడుదల ఉండడంతో తమ సినిమా వసూళ్లపై ప్రభావం పడుతుందని ఆర్.ఆర్.ఆర్ చిత్ర యూనిట్ భావించింది. అయితే విడుదల రోజున కనీసం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది.
ఆ విధంగా మొదటి రోజున డల్ గా ప్రారంభించిన ఎటాక్ సినిమా కంటెంట్ పరంగా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. శుక్రవారం రోజున కేవలం మూడున్నర కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది ఈ సినిమా. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎనిమిదవ రోజు కలెక్షన్స్ లో ఇది 26 శాతం మాత్రమే. అలా ఎనిమిదవ రోజు 13 కోట్ల రూపాయలతో టాప్ పొజిషన్ లో ఉంది ఈ చిత్రం. హిందీ లో 150 కోట్ల మార్కును క్రాస్ చేయబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా తెలుగు సినిమాలలో నటించను అని జాన్ అబ్రహం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి కనబరచలేదు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నేనొక హిందీ యాక్టర్ నీ తెలుగు లేదా మరొక ప్రాంతీయ భాషలో నేను ఎప్పటికీ నటించను అని ఆయన వ్యాఖ్యానించారు.