మహేష్ ఆలోచన మారడానికి కారణం ఏంటి?

P.Nishanth Kumar
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే నెలలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ అందించిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఆ విధంగా ఈ సినిమాపై అందరి లో భారీ అంచనాలే నమోదయ్యాయి అని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయబోతున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా గా రాబోతుంది. చాలా రోజుల నుంచి వీరి కాంబినేషన్లో సినిమా రావాలని ప్రేక్షకులు కోరుకున్నారు కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ ఉండటంతో అందరిలో ఎంతో నిరాశ నెలకొంది. చివరకు ఈ చిత్రాన్ని వీరి కాంబినేషన్లో ఓ సినిమా చేయడానికి అంతా సిద్ధం కావడం విశేషం. తొందర్లోనే ఆర్ఆర్అర్ సినిమాకు సంబంధించిన పనులు ముగించుకొని రాజమౌళి ఈ చిత్రంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు.
ఇంకొక వైపు మహేష్ బాబు వరుస సినిమాల
 తో విజయాన్ని సాధించి కుంటూ పోవడం జరుగుతుంది. దాంతో ఈ సినిమా కూడా తప్పకుండా విజయవంతం అవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇక సర్కారు వారి పాట సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని మొన్నటిదాకా తెలుగులో మాత్రమే విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కాని ఈ సినిమాను తమిళ కన్నడ మలయాళ భాషలలో సైతం విడుదల చేయాలని అనుకుంటున్నారట. మహేష్ దీనిని సూచించడం విశేషం. అందరు హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే తను ఎందుకు తెలుగు కు మాత్రమే పరిమితం అవ్వాలని అనుకున్నాడో ఏమో ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం ఆయన అభిమానులను సంతోషపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: