ప్రభాస్ సినిమాలు గందరగోళం.. ఎప్పుడు ఏది?

P.Nishanth Kumar
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో గందరగోళం నెలకొని ఉన్నట్లు గా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చెప్పవచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలను లైన్ లో పెట్టి అన్ని సినిమాలను ఒకేసారి చేస్తున్నాడు ప్రభాస్. నిజంగా పాన్ ఇండియా హీరో ఈ విధంగా సినిమాలు చేయడం అంటే చాలా ధైర్యం ఉండాలి అని చెప్పాలి. తన షూటింగ్ లను ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాడో తెలియదు కానీ ప్రభాస్ మాత్రం వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను భారీస్థాయిలో అలరిస్తూ ఉన్నాడు.

ఇకపోతే రాధే శ్యామ్ చిత్రాన్ని మార్చి 11వ తేదీన విడుదల చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు తన సలార్ తీసుకురావాలని గతంలో భావించాడు. దానికి తగ్గట్లుగానే షూటింగ్ కూడా పూర్తి చేసే స్థాయికి తీసుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు కూడా మొదలు పెట్టాడు. అయితే అనూహ్యంగా ఆది పురుష్ చిత్రం విడుదల జరగాలని చిత్ర నిర్మాతలు పట్టుబడడంతో ఈ సినిమాను ఇప్పుడు విడుదల చేయాలా వద్దా అన్న ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఒకవేళ ఆదిపురుష్ సినిమా ముందుకు వచ్చి రిలీజ్ అయితే సలార్ వచ్చే ఏడాది విడుదల అవుతుందని అనుకోవచ్చు. అలా జరగడం నిర్మాతలకు ఏ విధమైన నష్టాన్ని తీసుకు వస్తుందో చూడాలి. ఇది చాలదు అన్నట్లు మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో చేసే విధంగా ప్రభాస్ ముందుకు వెళుతున్నాడు. ఈ చిత్రం కొద్ది రోజుల సమయంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. ఆ నేపథ్యంలో ప్రభాస్  ఈ సినిమా ను ఇదే ఏడాది తీసుకు వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఒకేసారి అన్ని సినిమాలను నెత్తిన వేసుకుని చేస్తున్న ప్రభాస్ కు ఇలాంటి సమస్యలు రావడం సహజమే అయినా వాటిని ప్రేక్షకులకు అనుగుణంగా తీర్చిదిద్దడమే అసలు విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: