మెగా హీరోతో హృతిక్ రోషన్ మూవీ... డైరెక్టర్ ఎవరో తెలుసా?

VAMSI
ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టి స్టారర్ మూవీల హవా నడుస్తోంది. ఈ మధ్య వరుసగా మల్టీ స్టారర్ చిత్రాలు తెలుగులో తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబో మన ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ తో ఓ బాలీవుడ్ స్టార్ హీరో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో వరుణ్ తేజ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మల్టీ స్టారర్ మూవీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం రౌడీ హీరో విజయ దేవరకొండ మూవీతో టై అప్ అయున్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ తరవాత వరుణ్ తో సినిమా చేసేందుకు ఓ కథ ను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది  ఓ మల్టీ స్టారర్ మూవీ అని సమాచారం. ఇందులో ఒక హీరోగా మన తెలుగు హీరో వరుణ్ తేజ్ కాగా మరొక హీరో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అని టాక్. మొదట్లో హృతిక్ కాదన్నా ఆ తర్వాత కథలో కొన్ని మార్పులు చేయించుకుని ఈ తెలుగు సినిమాకి ఒకే చెప్పినట్లు వార్తలు వినపడుతున్నాయి. బి టౌన్ లో కూడా ఈ వార్తలు విపిస్తున్నాయని టాక్. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ చేసే విధంగా చిత్రీకరించాలని ప్లాన్ జరుగుతోందట. ఇదే కనుక నిజమైతే ఇక టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకుల  సంతోషానికి అవధులు లేవు. క్రిష్ సిరీస్ తో హృతిక్ మన టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచుకోగా...వరుణ్ తేజ్ కి కూడా బాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇలా అన్ని విధాలుగా ఈ కాంబో కి మంచి సూచనలే కనపడుతున్నాయి. అందులోనూ ఈ సూపర్ కాంబో ను తెరకెక్కించబోతుంది టాలీవుడ్ సూపర్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కావడంతో వార్త వైరల్ గా మారింది. అయితే ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ కానుంది, మిగిలిన అన్ని విషయాలపై ఓ క్లారిటీ రావాలంటే అటు డైరెక్టర్ నుండి కానీ ఇటు హీరోల నుండి కానీ అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: