రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయిలో మంచి రికార్డ్ ను అందుకున్నారు.. ఆ సినిమా తర్వాత భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. ఆ సినిమా తో అతని జాతకం పూర్తిగా మారిపొయింది. ఇప్పుడు కేవలం భారీ బడ్జెట్ సినిమాలలో మాత్రమే నటిస్తూ వస్తున్నాడు. అతను ఇప్పుడు ఒక్కో సినిమా కి 150 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా ఒక టాక్ అయితే వస్తోంది.
ఇక డార్లింగ్ ఇప్పుడు వరుసగా ఐదు సినిమాల లో నటిస్తూ ఫుల్ బిజిగా ఉన్నాడు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బులను ఫారిన్ దేశాలలొ కూడా పెట్టుబడి పెడుతూన్నారు. అలా రెండు చేతులా సంపాదిస్తున్నాడు. డార్లింగ్ ఒక దేశంలో అత్యంత ఖరీదైన విల్లాను కొనుగోలు చేసినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సాదారణంగా ఫారిన్ టూర్స్, ఓవర్సీస్ షూటింగ్ షెడ్యూల్స్ కి ప్రభాస్ నో చెప్పే రోజులు పోయాయని తెలుస్తోంది. ఎందుకంటే అప్పట్లో ప్రభాస్ హైదరాబాద్‌తో పాటు భారతదేశం లోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్‌కి ఎక్కువ ఇష్టపడే వాడు కాదు.
అంతేకాదు.. యూరప్ రియల్ ఎస్టేట్ మార్కెట్లలో కూడా ప్రభాస్ భారీగా పెట్టుబడులు పెట్టాలని, కొన్ని ఖరీదైన ఆస్తులను సొంతం చేసుకోవాలని ఆలొచిస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ అతనికి ఉన్న విల్లాను అమ్ముతారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ సినిమాల విషయాన్నికొస్తే.. రాధే శ్యామ్ విడుదల కోసం ప్రభాస్ ఎదురుచూస్తున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల లో సినిమా విడుదల అవుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సలార్, ఓం రావత్ దర్శకత్వంలో ఆది పురుష్ వంటి సినిమాలు రానున్నాయి. అనంతరం నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె, మరో ప్రాజెక్ట్ ను కూడా లైన్ లో పెట్టాడు.. ఆ సినిమాలు అన్నీ మంచి హిట్ ను అందుకుంటే డార్లింగ్ క్రేజ్ మరింత పెరగనుంది.