ఉచిత హామీల విషయంలో పార్టీలు వెనకడుగు వేస్తున్నాయా? ఓటర్ల సంగతి ఎంటి?
తమిళనాడులో నిజంగానే హామీలిచ్చాడు. ఇందులో.. ఎదుటివాళ్లు హామీలు ఇస్తున్నారు కదా అని ఓటు వేయొద్దని చెప్పడం ఒక ఉద్దేశం అయితే.. పార్టీల హామీలపై సెటైర్లు వేయడం మరో ఉద్దేశం.కలర్ టీవీలు, ఫ్యాన్లు, మిక్సీలు, ల్యాప్‌టాప్‌లు.. ఇలా ఎన్ని హామీలు ఇచ్చారో తమిళనాడులో. ఆ రాష్ట్రం సంగతేమో గానీ.. దేశవ్యాప్తంగా ఎన్నికల హామీలపై ఓ చర్చ అయితే జరుగుతోందిప్పుడు.
కాంగ్రెస్ హామీలపై మోదీ చేసిన కామెంట్.. ‘కాస్త చూసుకుని హామీలు ఇవ్వండంటూ’ ఖర్గే చెప్పడం చూశాక.. ‘గ్యారెంటీ పే చర్చ’ నడుస్తోంది. గెలవడానికి హామీలు ఇవ్వడం, గెలిచాక చతికిలపడడం, ప్రజల్లో నమ్మకం కోల్పోవడం.. కొన్ని పార్టీలకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. ఇక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మరోసారి ఆలోచించుకుంటామని కర్నాటక ప్రభుత్వం అంటోంది.
ఈక్రమంలో తాజగా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం బడ్జెట్ లోబడి హామీలు ఇవ్వాలని పార్టీ నేతలకు సూచించారు. అమలు కానీ హామీలు ఇస్తే ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో పాటు ప్రధాని మోదీ సైతం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. అయితే ఉచితాలకు అలవాటు పడిన ప్రజలు వీటిని ఆపేస్తే ఓట్లు వేస్తారా అనేదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా అభివృద్ధి, సంక్షేమం రెండు పడవల లాంటివని.. ఏ ఒక్కటి బ్యాలెన్స్ తప్పినా కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఓటర్లు ఏం ఆలోచిస్తారో చూడాలి.