అఖండ 2: విడుదల వాయిదా.. ఫ్యాన్స్ రియాక్షన్..!

Divya
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా అఖండ 2. బాలకృష్ణ ,బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో వీరీ కాంబినేషన్లో వచ్చిన లెజెండ్, సింహ, అఖండ వంటి చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో అఖండ 2 భారీ అంచనాల మధ్య ఈ రోజున (డిసెంబర్ 5) విడుదల చేస్తామంటూ చిత్ర బృంద ప్రకటించింది. ఇప్పటికే ప్రమోషన్స్ ను పూర్తి చేశారు చిత్ర బంధం. ఈ సినిమా ప్రీమియర్స్ షోలు రద్దయినట్లుగా నిన్నటి రోజున ప్రకటించారు మేకర్స్. కానీ ఆ కొద్దిసేపటికి ఈ సినిమా విడుదల తేదీ కూడా రద్దయినట్లుగా ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.


బాలయ్య అభిమానులు ఈ విషయం పైన భిన్నాభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కొంతమంది 14 రీల్స్ ప్లస్ సంస్థ కు డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వగా మరి కొంత మంది అఖండ 2 విడుదల వాయిదా పడడం వల్ల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.. అభిమానం ఏం చేసింది మీకు మా హీరో కష్టాన్ని నేలపాలు చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.


మరి కొంతమందిని రిలీజ్  డేట్ మాత్రమే మారింది..కానీ విధ్వంసం కాదు, అఖండ 2 సక్సెస్ సంచలనం అలాగే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల వద్దకు అభిమానులు చేరుకొని భారీ ఎత్తున కేక్ కటింగ్ వంటివి చేయగా.. సినిమా వాయిదా పడిందని తెలిసి నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు.



మరొక అభిమాని ఏకంగా అఖండ గెటప్ వేసుకొని థియేటర్ వద్దకు వచ్చారు.. బాలయ్య బాబుని స్క్రీన్ పైన చూసేందుకు ఎంతో ఆత్రుతతో ఎదురుచూసిన తమకు నిరాశ తప్పడం లేదంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. అన్ని అడ్డంకులు తొలగిపోయి, వీలైనంత త్వరగా ఈ సినిమా రిలీజ్ అయితే ఆనందపడతామంటూ అఘోర గెటప్ లో వచ్చిన ఒక అభిమాని మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: