అఖండ 2 వాయిదా: బాలయ్యకి ప్లసా..? మైనసా..?
కొంతమంది ఇది పాలిటికల్ ప్రెజర్ వల్ల జరిగిందని చెబుతుంటే, మరికొందరు ఇండస్ట్రీలోని కొన్ని పెద్దల కుట్ర అని ధారాళంగా ఆరోపిస్తున్నారు. నిజం ఏదైనా కావొచ్చు, కానీ ఇటువంటి పరిస్థితి బాలయ్య వంటి లెజెండరీ హీరోకి ఎదురవడం ఇండస్ట్రీలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో సూచిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ వాయిదా వల్ల బాలయ్య కెరీర్ పై ప్రభావం ఏమిటి? ఇది నిజంగా పాజిటివ్‌నా, నెగటివ్‌నా అనేది అభిమానుల్లోనే కాదు, సినీ వర్గాల్లో కూడా పెద్ద చర్చగా మారింది. ఒకవైపు కొందరు ఫిల్మ్ అనలిస్టులు, ఫ్యాన్స్ ఇలా అంటున్నారు…“బాలయ్య అంటేనే సక్సెస్ కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన చేసే సినిమా ఏదైనా హిట్ అవుతుంది. ఈ వాయిదా ఆయన కెరీర్‌ని ఏమాత్రం దెబ్బతీయదు. పైగా ఫ్యాన్స్ సింపతి కూడా పెరిగే అవకాశం ఉంది.”
మరోవైపు కొంతమంది సోషల్ మీడియాలో,“ఇంత పెద్ద హీరో సినిమా ఇలా చివరి నిమిషంలో వాయిదా పడటమంటే అభిమానుల్లో నెగిటివిటీ రావచ్చు. క్రేజ్‌కి కొద్దిగా బ్రేక్ పడొచ్చు” అంటూ స్పందిస్తున్నారు.కానీ అందరి కామెంట్లను బట్టి చూస్తే, 80% మంది అభిమానులు మాత్రం బాలయ్యపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. వారి మాటలు ఒక్కటే —“బాలయ్య నిజాయితీగల వ్యక్తి. దేవుడు ఆయనతో ఉన్నాడు. ఒక సినిమా వాయిదా పడిందని ఆయన కెరీర్‌పై నెగెటివ్ ప్రభావం పడదు. అఖండ 2 ఎప్పుడొచ్చినా బ్లాక్‌బస్టర్ అవుతుంది.”. సినిమా వాయిదా వెనక ఉన్న అసలు కారణం ఏమిటో ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం ఒకే స్లోగన్‌తో నిలబడ్డారు… “బాలయ్యఅంటే బాక్స్ ఆఫీస్ సునామీ! డేట్ మారొచ్చు… కానీ మా బాలయ్య పవర్ మారదు!”.