అఖండ 2: ఖబర్దార్ బిడ్డా .. నిర్మాణ సంస్థకు ఫ్యాన్స్ వార్నింగ్..!

Divya
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2. ఈ చిత్రాన్ని బోయపాటి దర్శకత్వం వహించగా ఈ రోజున (డిసెంబర్ 5) గ్రాండ్గా విడుదల కావాల్సి ఉంది.14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ ఈ సినిమా ప్రీమియర్ షోని రద్దు చేసినట్లు మొదట ప్రకటించారు. ఆ తర్వాత సినిమానే కొన్ని కారణాల చేత వాయిదా వేసామంటు వెల్లడించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పడంతో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు గురిచేసింది. సినిమా మరి కొన్ని గంటలలో విడుదల కావాల్సి ఉండగా ఇలా చెప్పడంతో అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది.



ముఖ్యంగా ఈ సినిమాను చూడాలని టికెట్స్ బుక్ చేసుకున్న బాలయ్య అభిమానులు తీవ్రస్థాయిలో నిర్మాణ సంస్థకు వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా బాలయ్య ఫ్యాన్స్ మాట్లాడుతూ.. నందమూరి అభిమానులతో ఆడుకుంటున్న 14 రీల్స్ సంస్థ.. ఖబర్దార్  మీకు ఏవైనా పాత బకాయిలు ఉంటే చూసుకోవాలి.. బాధ్యత లేని వాళ్ళు సిని పరిశ్రమలో నిర్మాతగా కొనసాగకూడదని.. బాలయ్య బాబు కల్మషం లేని మనిషి ఆయన అభిమానులు కూడా అలాగే ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో కొన్ని లక్షల మంది అభిమానులు ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ మీరు వారికి బాధని మిగిల్చారు. ఈ విషయంపై భవిష్యత్తులో కూడా మీరు తీవ్రమైన పరిణామం ఎదుర్కొంటారు అంటూ వార్నింగ్ ఇచ్చారు.


ఒక పెద్ద హీరోతో సినిమా తీసేటప్పుడు అడ్డంకులు లేకుండా చూసుకోవాలి కథ అంటూ ఫైర్ అయ్యారు. ఎప్పుడో జరిగిన పాత సినిమా డబ్బుల కోసం హైకోర్టులో స్టే వేసేంతవరకు నిర్మాతలు చూసుకోకుండా అంత నిర్లక్ష్యంగా ఉన్నారా? అంటూ ఫైర్ అవుతున్నారు. గాజువాక మౌని కాంప్లెక్స్లో ఎంతోమంది అభిమానులు నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోతున్నారని , ఎటువంటి సమాచారం లేకుండా  సినిమాని వాయిదా వేస్తారా? అభిమానులు రూ 600 రూపాయలతో ప్రీమియర్ షో టికెట్లు కొని వస్తే సినిమా క్యాన్సిల్ అయిందని చెప్పడం అభిమానులకు బాధగా ఉందంటూ ఫైర్ అవుతున్నారు. అలాగే సినిమాను కూడా వాయిదా వేశారు.. మీరు అభిమానులకు ప్రత్యేకించి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: