టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు తన బ్యానర్ లో ఎన్నో సినిమాలను నిర్మించాడు. దిల్ రాజు ఆయన బ్యానర్ లో స్టార్ , మీడియం , చిన్న హీరోలతో ఇలా దాదాపు అన్ని రకాలైన హీరోలతో సినిమాలను నిర్మించి అద్భుతమైన
సక్సెస్ లను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే దిల్ రాజు ,
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మొదటగా
మున్నా అనే
మూవీ ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత దిల్ రాజు ,
ప్రభాస్ హీరోగా
మిస్టర్ పర్ఫెక్ట్ అనే
మూవీ ని రూపొందించాడు. ఈ
సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే
మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా స్టార్ట్ కావడానికి ముందు చాలా ఫన్నీ సన్నివేశాలు జరిగినట్లు ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చెప్పుకొచ్చాడు.
దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నాకు దశరథ్ "మిస్టర్ ఫర్ఫెక్ట్" స్టోరీ చెప్పినప్పుడు అది
ప్రభాస్ కి బాగుంటుంది అనిపించింది. దానితో వెంటనే
ప్రభాస్ కి ఆ కథను
ఫోన్ లోనే దశరద్ ద్వారా వినిపించాను. కథ విని ఆయన ఫస్ట్ అఫ్ బాగుంది , సెకండ్ హాఫ్ బాగోలేదు అన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు నేను కథ మొత్తాన్ని మళ్లీ సెట్ చేసి ఆయనకు వినిపించాను. ఇకపోతే
ప్రభాస్ ఆ కథ వినడానికి రమ్మన్నప్పుడు కచ్చితంగా ఈ
సినిమా చేయొద్దు , కానీ నేరుగా చెబితే బాగోదు కాబట్టి కథ విని స్టోరీ బాగోలేదు అని చెబుదాం అనుకొని కథ విన్నాడు. కానీ నేను స్టోరీను డెవలప్ చేసిన విధానానికి ఆయన స్టన్ అయ్యి ఆ సినిమాను ఒప్పుకున్నట్లు ఆయన దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.