కెరీర్ పై కరోనా ఎఫెక్ట్.. టెన్షన్ లో యంగ్ హీరో..?

Anilkumar
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ అప్ కమింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు ఫుల్ టెన్షన్ లో ఉన్నాడు. నిఖిల్ చివరగా 2019లో 'అర్జున్ సురవరం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జర్నలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు ఈ హీరో.ఇక ప్రస్తుతం నిఖిల్ ఖాతాలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో కార్తికేయ సినిమాకి సీక్వెల్గా తెరకెక్కుతున్న 'కార్తికేయ 2' అలాగే '18 పేజెస్' అనే సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్టులకు సైతం నిఖిల్ సంతకం చేసినట్లు తాజాగా వెల్లడించాడు. అయితే ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో సినిమా విడుదలలు వాయిదా పడుతున్న విషయం అందరికి తెలిసిందే. 

ఈ క్రమంలోనే కోవిడ్ కారణంగా నిఖిల్ సినిమాల విడుదల తేదీలు ఇప్పుడు పూర్తిగా గందరగోళంలో పడ్డాయి. అయితే ఈ విషయాన్ని నిఖిల్ ఎంతో ఆవేదనతో కరోనా మహమ్మారి కెరీర్ ను ఊహించని స్థాయిలో ప్రభావితం చేయడం చాలా బాధగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ మేరకు నిఖిల్ ట్వీట్ చేస్తూ.." అర్జున్ సురవరం విజయం తర్వాత నేను నాలుగు సినిమాలకు సంతకం చేశాను.ఆ 4 అద్భుతమైన స్క్రిప్ట్‌లపై చాలా నమ్మకంగా ఉన్నాను. కానీ రిలీజ్ డేట్స్ అన్నీ తారుమారయ్యాయి. ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు అన్ని తొలగిపోయి మా సినిమాలు అనుకున్న సమయానికి విడుదల అవ్వాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా" అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. 

నిజానికి ఈ కరోనా మహమ్మారి నిఖిల్ తో పాటు మరి కొంత మంది నటీనటులకు కూడా సవాల్ గా మారింది.ఇక మరోవైపు కొన్ని రోజుల క్రితం నిఖిల్  ఏపీ టికెట్ల సమస్యల గురించి థియేటర్లు మూసివేయడం గురించి ధైర్యంగా మాట్లాడాడు. థియేటర్లను ఏకంగా దేవాలయాలతో పోలుస్తూ..తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలియజేశాడు. అలాంటిది కరోనా కారణంగా నిఖిల్ సినిమాలు వాయిదా పడడం అతన్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది...!!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: