"దేవకీ నందన వాసుదేవ" ఫస్ట్ సింగల్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
హీరో మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకున్న అశోక్ గల్లా ప్రస్తుతం "దేవకి నందన వాసుదేవ" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో బేబీ సినిమాతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న వైష్ణవి చైతన్య , అశోక్ గల్లా కి జోడిగా నటిస్తూ ఉండగా ... అర్జున్ జంధ్యాల ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథను అందించాడు. బీమ్స్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్ర ఈ సినిమాకు డైలాగ్స్ ను అందిస్తూ ఉండగా ... లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
 

ఈ మూవీ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాకి ప్రసాద్ మూడేళ్ల "డి ఓ పి" గా పని చేస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన మొదటి సాంగు విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. "ఏమయిందే" అంటూ సాగే ఈ మూవీ లోని మొదటి ఫుల్ లిరికల్ వీడియోను మే 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇది  ఇలా ఉంటే హీరో మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకున్న అశోక్ "దేవకి నందన వాసుదేవా" మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: