సీనియర్లను పక్కనపెట్టి యంగ్ స్టర్స్ తో మెగాస్టార్..!
చిరంజీవి మళయాళీ హిట్ 'లూసిఫర్'ని 'గాడ్ ఫాదర్'గా రీమేక్ చేస్తున్నాడు. తమిళ మేకర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. 'హనుమాన్ జంక్షన్' తర్వాత తెలుగులో సినిమాలు తీయని మోహన్ రాజా, 20ఏళ్ల తర్వాత చిరంజీవి 'గాడ్ ఫాదర్'తో టాలీవుడ్లో అడుగుపెట్టాడు. సినిమా బిజినెస్ మొత్తం యూత్ ఆడియన్స్ చుట్టూనే తిరుగుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకి రావడం తగ్గించాక, కుర్రాళ్లే సినిమా పోషకులుగా మారారు. అందుకే హీరోలంతా యూత్ పల్స్‌ని క్యాచ్ చేసే దర్శకులనే ప్రిఫర్ చేస్తున్నారు. చిరంజీవి కూడా ఇదే బాటలో యంగ్ మేకర్స్‌తో సినిమాలు చేస్తున్నాడు.
చిరంజీవి, బాబీ దర్శకత్వంలోనూ ఒక సినిమా చేస్తున్నాడు. 'పవర్' తర్వాత పెద్దగా హిట్స్‌లేని బాబీ దర్శకత్వంలో చిరు ఒక మాస్ ఎంటర్టైనర్ మొదలుపెట్టాడు. అనౌన్స్మెంట్ పోస్టర్‌తోనే అంచనాలు పెంచిన ఈ సినిమాలో కొత్త చిరుని చూస్తారనే టాక్ వస్తోంది. ఇక చిరంజీవి తాజాగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమాకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నటించాడు. తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి నటించడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదలవుతోంది.