పుష్ప : బన్నీ బన్ గయా యాక్టర్..అదరగొట్టాడ్రా!
ఉంటే ఉండనీ ప్రయోగ రీతిలో ఓ సినిమా సక్సెస్ ను
మనం మెజెర్ చేయలేం .... చేయకూడదు కూడా!
నటుడు అన్న పదానికి ఇంతవరకూ తూకం వేయదగ్గ పని ఒక్కటి కూడా ఆయన చేయలేదు. అఫ్ కోర్స్ డబ్బులు తెచ్చే పనులు ఏవయినా చేశాకే ఒక స్టార్ హీరో ఇలాంటి ప్రయోగాలు చేయాలి. ఆ విధంగా ఈ సినిమా డబ్బులు తీసుకువచ్చే పనితో పాటు పేరు తీసుకువచ్చే పని కూడా చేస్తుందని బన్నీ నమ్మకం.. ఆ నమ్మకాన్ని ఇంకా రెట్టింపు చేసేలా సుక్కూ కూడా తన వంతు మాటలు కొన్ని నిన్న చెప్పారు. మీడియా మీట్ లో చాలా మంచి విషయాలు చెప్పారు.. ఏదేమయినా ఎవరి అనుభవం ఎవరి జీవితం వారిదే వాటి నుంచే లేదా పరిశీలనాత్మక శక్తి నుంచే ప్రయోగ రీతి అన్నది ఒప్పుకోలుకు నోచుకుంటుంది.
జీవితాన్ని సినిమాకూ, జీవితాన్ని మరో కొత్త ప్రయత్నానికి అప్పగించడం అన్నది చాలా రిస్కు. కష్టంతో కూడుకున్న పని అని రాయడం కన్నా అంతకుమించి మరో పదం ఏదయినా ఉంటే వెతుక్కోవాలి.. బాహుబలితో ప్రభాస్, కేజీఎఫ్ తో యష్, ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్, చరణ్, అదే విధంగా అదే కోవలో అదే తోవల్లో అల్లు వారింటి అబ్బాయి అర్జున్.
స్టార్ వేరు స్టార్ డమ్ వేరు
యాక్టర్ వేరు యాక్టింగ్ లెవెల్ వేరు
ఇలా చాలా ఉన్నాయి చాలా ఉంటాయి కూడా
నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇచ్చిన నిర్వచనం ప్రకారం
నటులెవ్వరూ తారలు కాలేరు తారలెవ్వరూ నటులుగా రాణించలేరు. కనుక ఏదో ఒకటే ఉండాలి. ఏదో ఒకటే పనిచేయాలి..ఆ విధంగానో ఏ విధంగానో ఆలోచించినా సినిమా అనేది ఓ పెద్ద స్ట్రాటజిక్ వర్డ్ గా మిగిలిపోవాలి.. ఫీల్ ఒక చోట సోల్ మరో చోట అన్న విధంగా కాకుండా ఫీల్ అండ్ సోల్ అన్నవి రెండూ కుదిరి పోవాలి. ఆ విధంగా ఒక స్టాటిక్ క్యారెక్టర్ పుష్ప అని ఎనలిస్టులు అంటున్నారు. ఆ క్యారెక్టర్ ను లీడ్ చేయడంలో ప్లే చేయడంలో అల్లు అర్జున్ బాగా రాణించాడని మెచ్చుకుంటున్నారు.