అల్లు అర్జున్ తన సినిమాల ఎంపిక విషయంలో తన సినిమాల చిత్రీకరణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటాడో ఆయన నటించిన సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా అంతే జాగ్రత్త వహిస్తూ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనేలా చేస్తాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ తెలుగులో విపరీతమైన జనాదరణ పొందడమే కాకుండా ఎప్పటినుంచో ఆయన ఇతర భాషలలో మార్కెట్ పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేశాడు. ఆ విధంగా మలయాళ సినిమా పరిశ్రమలో ఆయనకు భారీ క్రేజ్ నెలకొంది.
అక్కడి హీరోలతో సమానంగా అల్లు అర్జున్ మంచి మార్కెట్ తెచ్చుకున్నాడు అంటే ఆయన ఏ రేంజ్ లో ప్లాన్ చేసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ లో పాన్ ఇండియా మార్కెటింగ్ మొదలు కాక ముందే అల్లు అర్జున్ ముందుచూపుతో అన్ని భాషలలో సినిమాలను విడుదల చేస్తూ ప్రేక్షకులను ఎంతవరకూ అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా మొదటి సారి పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్నాడు. పుష్ప సినిమా 5 భాషలలో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా తన గత సినిమాల లాగానే ఎంతో విభిన్నంగా ప్లాన్ చేశాడు. అల్లు అర్జున్ సినిమాపై క్రేజ్ పెంచే విధంగా ఆయన ఆలోచనలు చేస్తూ తన సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతున్నాడు. ఒకదాని తరవాత మరొక పాటను విడుదల చేస్తూ ఒక్కసారిగా సినిమాపై మంచి క్రేజీ నెలకొనేలా చేసుకుంటున్నాడు. అంతే కాదు మొదట ఆయన టీజర్ విడుదల చేసి ప్రేక్షకుల తనవైపు తిప్పుకున్నడు. ఇప్పుడు పాటలను విడుదల చేస్తూ ఎవరిని చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్నాడు. త్వరలోనే మిగిలిన పాటలను విడుదల చేసి ట్రైలర్ను విడుదల చేసి ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా ప్రత్యక్ష ప్రమోషన్స్ లో పాల్గొననున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుండగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 వ తేదీన మొదటి భాగం సినిమా విడుదల అవుతుంది.