ఏ సినిమా హీరో అయినా తన సినిమా బాగా ఉంటుందని ప్రేక్షకులకు చెబుతూ ఉంటాడు. ఆ చిత్రం ఎలా ఉన్నా కూడా బాగానే ఉందని చెబుతూ వారిలో ఏ మాత్రం నిరాశ లేకుండా చేస్తూ ఉంటాడు. కానీ కొంతమంది హీరోలు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా తమ సినిమా విషయంలో ప్రదర్శిస్తూ ఉంటారు కానీ ఆ సినిమా ఫలితమే చివరకు దేన్నైనా నిర్ణయించబడుతుంది. ఆ విధంగా హిట్ ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా ప్రేక్షకులలో గొప్ప ఇమేజ్ ను ఏర్పరచుకుని ఇప్పటివరకు స్టార్ హీరోగా ఉన్నాడు విజయ్ దేవరకొండ.
ఆయన ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను చేస్తూ ఉండగా ఈ చిత్రం వచ్చే ఏడాది లో విడుదల అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ముంబైలో జరుగుతూ ఉండగా ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు మైక్ టైసన్ కూడా ఉండడం విశేషం. కాగా పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమా అక్టోబర్ 29న విడుదల కాబోతు ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చాడు.
ఆయన స్పీచ్ సమయంలో లో లైగర్ సినిమా గురించి చెప్పగా ఆ మాటల్లో ఆ సినిమా తప్పకుండా విజయాన్ని తెచ్చి పెడుతుందనే కాన్ఫిడెన్స్ కనబడింది. విజయ్ దేవరకొండ అభిమానులకు సరైన విజయం లేక బాగా ఆకలి మీద ఉన్నాడు ఈ చిత్రం ఆకలి తీరుస్తుంది అని చెప్పకనే చెప్పాడు. అంతే కాదు ఆయన కళ్ళల్లో కూడా ఎంతో కాన్ఫిడెంట్ ఈ సినిమా విషయంలో కనిపించింది దేశం మొత్తం అదిరిపోయేలా ఈ సినిమా ఉండబోతోందని ఆయన తన స్పీచ్ లో వెల్లడించారు తప్పకుండా దేశవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు ఆ విధంగా విజయ్ దేవరకొండ తన సినిమాపై అంచనాలను మరింతగా పెంచే వాడని . చెప్పవచ్చు