టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన క్లాస్ డైరెక్షన్ తో మాస్ ప్రేక్షకులను సైతం ఎంతగానో అలరిస్తూ ఉంటాడు. ఆయన సినిమాలు అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఆ చిత్రాన్ని ఎంతో బాగా ఆస్వాదించగలుగుతున్నాడు. అలా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలను తెరకెక్కించే ఆయా హీరోల అభిమానులకు మంచి ట్రీట్ అందించిన త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు తో తన మూడు సినిమాలు చేస్తున్నాడు. పెద్ద హీరోలకు మంచి మంచి హిట్స్ అందించిన త్రివిక్రమ్ రచయితగా చేసి ఆ తర్వాత డైరెక్టర్ గా మారాడు.
అతడు ఖలేజా వంటి సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన ఈ కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎన్ని రోజులు పట్టింది. ఈ నేపథ్యంలో వాటిని అధిగమించే దిశగా ఈ చిత్రం ఉండబోతోందని మహేష్ అభిమానులు చెబుతున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ తో ఆయన సినిమా చేయవలసి ఉంది. కానీ ఆ చిత్రం చివరి నిమిషంలో ఎందుకో క్యాన్సల్ అయింది. దాంతో ఇమిడియట్ గా తన పాత స్నేహితుడు అయినా మహేష్ బాబు తో త్రివిక్రమ్ సినిమా ఓకే చేసుకుని ఆ సినిమాకు సంబంధించిన పనులలో మునిగి ఉన్నాడు.
దాంతో పాటే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాకు రచయితగా పని చేస్తుండడం కూడా అందరిలో ఎంతగానో ఆసక్తి నెలకొంది. పవన్ హీరోగా చేస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తుండగా ఇప్పుడు ఆయన ఫోకస్ మొత్తం భీమ్లా నాయక్ సినిమాపైనే పెట్టడం విశేషం. మహేష్ బాబు తో సినిమా ను ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన శ్రద్ధ వహించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా ఉంటుందో చూడాలి. మరి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల అవుతున్న భీమ్లా నాయక్ చిత్రం కూడా ఈ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.