ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి విడుదలైన చాలా సినిమాలలో హీరోల కంటే ఎక్కువగా హీరోయిన్ ల హవానే కనిపిస్తుంది అని చెప్పవచ్చు. గ్లామర్ పరంగా నటనాపరంగా అలాగే సినిమా బిజినెస్ పరంగా కూడా వారి ఇమేజే ఎక్కువగా సినిమాకు ఉపయోగపడింది. అలా ఈ మధ్య వచ్చిన సినిమాలు ఏంటో చూద్దాం. అక్కినేని నాగచైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ చిత్రం పై ఓ రేంజ్ లో హైప్ రావడానికి కారణం హీరోయిన్ సాయిపల్లవి అన్న సంగతి అందరికీ తెలిసిందే.
మొదటినుంచి ఈ సినిమాలో నటిస్తుందని తెలిసినప్పటి నుంచి అందరు కూడా ఈ సినిమా చూడడానికి ఎంతగానో ఆసక్తి చూపించారు. అందులోనూ నాగచైతన్య కు ఉన్న క్రేజ్ పరంగా కూడా సినిమా పై కొంత డిమాండ్ నెలకొంది. ఆ తర్వాత దసరా సందర్భంగా విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే వల్లనే ఆ సినిమాకు అంత పెద్ద విజయం వచ్చిందని చెప్పవచ్చు.
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే ఇప్పటి వరకు స్టార్ హీరోల సరసన మాత్రమే నటిస్తూ వచ్చింది. కానీ అఖిల్ లాంటి చిన్న హీరోతో ఆమె నటించడం గొప్ప విశేషమే అయినా తాను ఈ సినిమా చేయడానికి కారణం అనే చేసిన పాత్ర అనే చెప్పాలి. విభా పాత్ర లో ఆమె తన నటనతో మెప్పించి సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యేలా చేసుకుంది అని చెప్పొచ్చు. అఖిల్ కూడా ఆమెకు ఏ మాత్రం తగ్గకుండా నటించాడు. అలాగే పెళ్లిసందడి సినిమా హీరోయిన్ శ్రీవల్లి కూడా శ్రీకాంత్ తనయుడు రోషన్ కంటే ఎక్కువగా తన అభినయం గ్లామర్ తో మెప్పించింది. ఇక మహాసముద్రం సినిమాలో ఇద్దరు హీరోల కంటే ఎక్కువగా హైలెట్ అయ్యింది హీరోయిన్ అదితి రావు హైదరి.