బొమ్మరిల్లు సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు భాస్కర్. సిద్ధార్థ హీరోగా జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో బొమ్మరిల్లు భాస్కర్ గా తన పేరును మార్చుకున్న ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో తెలుగు సినిమా పరిశ్రమకు దూరం అయిపోయాడు. తమిళంలో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు.
దాంతో చాలా కాలం కథ పై శ్రద్ధ పెట్టీ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు ఇటీవలే వచ్చాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు బొమ్మరిల్లు భాస్కర్. ఇటు విజయం లేక సతమతమవుతున్న అక్కినేని అఖిల్ కి కూడా హిట్ అందించి అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈ సినిమా సంబంధించిన చాలా విషయాలను చెబుతూ ఆయన పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు చాలామంది.టాలీవుడ్ హీరోలు అందరిలో ఇప్పుడు భాస్కర్ తో సినిమా చేయాలనే ఆసక్తి నెలకొంది.
తాజాగా ఆయన తన తదుపరి సినిమాని కూడా గీతాఆర్ట్స్ బ్యానర్ లోనే చేయాలని భావిస్తున్నాడు. దానికి కారణం కష్టాల్లో ఉన్న తనను అల్లు అరవింద్ కాపాడడమే అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సినిమా అవకాశం ఇవ్వడానికి చాలామంది నిర్మాతలు వెనకాడరు. కానీ తన కథను తన పనితనాన్ని నమ్మి అల్లు అరవింద్ ఈ అవకాశాన్ని ఇవ్వడం తనలో కాన్ఫిదెన్స్ తెచ్చిపెట్టిందని ఆ నమ్మకాన్ని మరొకసారి నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆయన గీతాఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమా చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి బొమ్మరిల్లు భాస్కర్ మరొక సారి తన నమ్మకాన్ని నిలబెడతాడా అనేది చూడాలి.