వారి రాజీనామాలు ఆమోదించ నంటున్న విష్ణు...!

murali krishna
సాధారణ రాజకీయాలను తలదన్నె రీతిలో జరిగిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయని తెలుస్తుంది. తీవ్ర పోటీ నడుమ జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు అనూహ్య విజయాన్ని అందుకున్నారని అందరికి తెలుసు.
ఎన్నికలను ఎంతో చాలెంజింగ్‌గా తీసుకున్న విష్ణు అందుకు తగ్గట్లుగానే తీవ్రంగా కృషి చేశారని తెలుస్తుంది. తండ్రి మోహన్‌ బాబు సహాయంతోపాటు ఇండస్ట్రీలో పలువురి సపోర్ట్‌తో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారని సమాచారం. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా ఫోన్‌లు చేసి మరీ ఎన్నికల కోసం పిలిపించారని తెలుస్తుంది. జెనిలీయా మరియు జయప్రద ఇలా వచ్చిన వారే విష్ణుని గెలిపించారు.ఇలా మా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విష్ణు విజయాన్ని సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ వివాదానికి తెర పడుతుందని అందరూ ఊహించుకున్నారట . కానీ నాగబాబు మరియు ప్రకాశ్‌ రాజులు మా సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారని సమాచారం. ఈ సందర్భంగా ఆయన తన విజయానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారని తెలుస్తుంది. అలాగే మా సభ్యత్వానికి రాజీనామా చేసిన వారి రాజీనామాలను తాను ఆమోదించడం లేదని విష్ణు తేల్చి చెప్పారని సమాచారం.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విష్ణు పలు సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. చిరంజీవీ తనను పోటీ నుంచి తప్పుకోమన్నారని చెప్పి షాక్ ఇచ్చాడు విష్ణు. అలాగే రామ్‌ చరణ్‌ ప్రకాశ్‌ రాజ్‌కు ఓటు వేశారని బాంబు పేల్చారని తెలుస్తుంది. మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరణం చేసిన వెంటనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సినిమా వాళ్ల కష్టసుఖాలను చెప్పుకుంటామని చెప్పుకొచ్చారట . తన విజయంలో తండ్రి మోహన్ బాబుదే కీలకమని చెప్పారని సమాచారం. ఆ తర్వాత తన విజయం కోసం నరేష్ ఎంతో కృషి చేశారని విష్ణు తెలిపారని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: