డిసెంబర్ కు గని.. వద్దంటున్న మెగా ఫ్యాన్స్!!

P.Nishanth Kumar
వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ భావించారు. ఇప్పుడు అది ఒకసారిగా అభిమానులను ఎంతగానో నిరాశను తీసుకు వస్తుంది. F2, గద్దల కొండ గణేష్ సినిమా లతో వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ హిట్లన్ uను సొంతం చేసుకొని మెగా హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఒకే సంవత్సరం ఈ రేంజ్ లో విజయాలన్ని అందుకున్న వరుణ్ తేజ్ స్పెషల్ హీరోగా నిలిచిపోయాడు. మొదటి నుంచి మంచి కథలు ఎంచుకుంటూ తన సినిమాల ద్వారా సత్తా చాటుకుంటున్నాడు వరుణ్ తేజ్.

ఇప్పుడు కూడా కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో కలిసి గని అనే వినూత్నమైన సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ నెలలో విడుదల కానుందని వార్తలు వస్తుండగా దీపావళి కి ఈ సినిమా విడుదల అన్నారు. కానీ ఆ నెల వరుణ్ తేజ్ రాకపోవడం మెగా అభిమానుల్లో నిరాశ తో పాటు టెన్షన్ పుట్టిస్తుంది. దానికి తోడు డిసెంబర్ లో ఈ సినిమా విడుదల అనడం మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.  డిసెంబర్ నెలలో ఆయన చేసిన సినిమాలు చాలా విడుదల కాగా అవి బాక్స్ ఆఫీసు వద్ద భారీ స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

ఆయన నటించిన తొలి సినిమా ముకుంద 2014వ సంవత్సరం డిసెంబర్ 24 వ తేదీన విడుదల అవగా ఆ తర్వాత లోఫర్ అంతరిక్షం సినిమాలు కూడా డిసెంబర్ నెలలోనే విడుదల అయ్యాయి. కానీ ఆ చిత్రలు ఏవీ కూడా హిట్ అవలేకపోయాయి. భారీ డిజాస్టర్ లు అయ్యాయి. ఆ విధంగా గా వరుణ్ కు  డిసెంబర్ నెల అచ్చి రాదని ప్రేక్షకులు డిసైడ్ చేశారు.  కానీ ఇప్పుడు ఆయన నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయడం కూడా బ్యాడ్ సెంటిమెంట్ గా వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా డిసెంబర్లో విడుదల అయితే ఎలాంటి రిజల్ట్ చేసుకుంటుందో అని మెగా అభిమానులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ రిస్క్ చేస్తాడా ఎందుకులే అని పోస్ట్ పోన్ చేస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: