పవన్ పోటీ ఇవ్వాలంటే ఈ మాత్రమైనా ఉండాలి!!

P.Nishanth Kumar
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా నుంచి వస్తున్న అప్డేట్ లు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. సినిమా చూడాలనే ఆతృత ను ఇంకా ఇంకా పెంచుతున్నాయి. పవన్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసిన కొద్ది రోజులలోనే భీమ్లా నాయక్ టీజర్ ను విడుదల చేసి ప్రేక్షకులకు కొత్తగా జోష్ ను చూపించారు చిత్ర బృందం. దగ్గుబాటి రానా ముఖ్య పాత్రలో నటిస్తు న్న ఈ సినిమా కు సంబంధించి న ఆయన టీజర్ ను కూడా చిత్రబృందం ఇటీవలే విడుదల చేసింది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియం సినిమా రీమేక్ గా తెలుగులో ఈ సినిమా హై ఓల్టేజ్ చిత్రం గా తెరకెక్కుతు ఉండగా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నా యి  ఇప్పుడు ఈ అప్డేట్ లతో ఆ అంచనాలను మరింత రెట్టింపు చేశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రానా పాత్ర డానియల్ శేఖర్ ను పరిచయం చేస్తూ ఓ టీజర్ను విడుదల చేసిన తర్వాత ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. రానా క్యారెక్టర్ ను అద్భుతంగా డిజైన్ చేయడంతో పాటు ఆయన డైలాగులు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉండటం విశేషం.

ఈ డైలాగులతో వీరిద్దరి మధ్య సన్నివేశాలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో అందరికీ అర్థం అయిపోతుంది. పవన్ పాత్ర భీమ్లా నాయక్ కి ఏ మాత్రం తీసిపోకుండా శేఖర్ తన పాత్రను డిజైన్ చేశాడని చెప్పవచ్చు. టీజర్ ను కూడా పవన్ టీజర్ కు ఏమాత్రం తగ్గకుండా ఈ టీజర్ ను అద్భుతంగా రూపొందించాడు. సాగర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా తమన్ సంగీతం సమకూర్చాడు. హీరోయిన్లుగా నిత్యమీనన్ మరియు ఐశ్వర్య రాజేష్ లు నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: