విశ్వనటుడు కమల్ హాసన్ త్వరలో ఓ తెలుగు సినిమా చేయనున్నాడు అనే వార్త ఆయన అభిమానులను మాత్రమే కాదు ప్రేక్షకులను కూడా ఎంతగానో సంతోషపరుస్తుంది. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమ అన్ని భాషల హీరోలతో సినిమాలు చేస్తూ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలను చేస్తూ తెలుగు సినిమా స్థాయిని రోజురోజుకు పెంచుకుంటుంది. ఇతర భాషల హీరోలు సైతం తెలుగులో సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తినీ చూపుతుండగా తమిళ హీరోలు ఇప్పటికే చాలామంది తెలుగులో సినిమాలు చేయడం విశేషం.
తమిళ మార్కెట్ ను సంపాదించడం మన హీరోలతో అవద అనుకున్నారో ఏమో కానీ అక్కడ హీరోలను తీసుకువచ్చి తెలుగు తమిళ సినిమాలను చేస్తున్నారు మన నిర్మాతలు. ఒకప్పటి స్టార్ హీరోలు రజనీకాంత్ కమల్ హాసన్ వంటి వారు తెలుగులో కొన్ని సినిమాలు చేయదా ఇప్పటి తరం హీరోలు కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ధనుష్, విజయ్, విజయ్ సేతుపతి శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోలు ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్నారు.
తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్ మరొకసారి తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఆయనతో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయించడానికి నిర్మాత సునీల్ నారాంగ్ ఇటీవలే కమల్ హాసన్ ను కలిసినట్లు తెలుస్తోంది. మరోవైపు కమల్ హాసన్ రెండు సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో విక్రమ్ అనే యాక్షన్ ఓరియంటెడ్ సినిమా చేస్తుండగా మరోవైపు శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సినిమాని కూడా ఆయన చేస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత కమలహాసన్ తెలుగు సినిమానే చేస్తున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు ఎవరు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మరి మన నిర్మాతలు తమిళ హీరోల ను తెలుగు చిత్ర పరిశ్రమ లోకి తీసుకు రావడానికి ఎన్ని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారో తెలియాలి.