బిగ్ బాస్ 5 : ప్రియ కి అది ఉపయోగపడుతుందా .... ??
ఇక గత రెండు సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించి అందరి నుండి మంచి ప్రశంసలు అందుకున్న కింగ్ అక్కినేని నాగార్జున మరొక్కసారి ఈ ఐదవ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తుండడం విశేషం. ఇక ఈ తాజా సీజన్ లో అనేకమంది యువ సెలబ్రిటీస్ తో పాటు కొందరు సీనియర్ సెలెబ్రిటీస్ ని కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వారిలో సీనియర్ నటి ప్రియ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొదట కొన్నేళ్ల క్రితం పలు సినిమాల్లో కీలక పాత్రలు చేసి అందరి నుండి బాగా పేరు అందుకున్నారు ప్రియ. ఇక మలయాళంలో 1986లో వచ్చిన నన్నిష్టమ్ ఎన్నిష్టం మూవీలో తన పెర్ఫార్మన్స్ తో మంచి పేరు పొందారు ప్రియ. ఆ తరువాత డేవిడ్ అనే సినిమాటోగ్రాఫర్ ని ఆమె వివాహం చేసుకున్నారు.
అప్పట్లో తెలుగులో చిరునవ్వుతో, రాజకుమారుడు, అలానే ఇటీవల వచ్చిన ప్రతిరోజు పండగే, జైసింహా ఇలా అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ప్రియా, ప్రస్తుతం పలు టివి సీరియల్స్ లో కూడ యాక్ట్ చేస్తూ నటిగా మరింత మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. ఇక ఈ షో కోసం ఇప్పటికే అన్ని విధాలా సిద్దమైన ప్రియా విజయం కోసం ఆమె కుటుంబసభ్యులు, అలానే మిత్రులు ముందస్తుగా ఆమెకు అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలుస్తోంది. మరి తెరపై అందరిని ఆకట్టుకుని ఆర్టిస్ట్ గా ఎంతో పేరు సంపాదించిన ప్రియ, ఫస్ట్ టైం ఇటువంటి రియాలిటీ షోలో ఎంతవరకు తన టాలెంట్ తో ఆడియన్స్ మనసు గెలుచుకుంటారో, ఆమె నటనా అనుభవం ఇందులో ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.