శ్రీదేవి నా రెండో తల్లి.. ఎమోషనల్ అయిన హీరోయిన్?

praveen
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా.. అద్భుతమైన నటిగా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీదేవి. ప్రస్తుతం శ్రీదేవి భౌతికంగా దూరమైనప్పటికీ  ఇప్పటికీ ఆమెకు అభిమానులు గుండెల్లో గూడుకట్టుకుని పూజిస్తూనే ఉన్నారు. దశాబ్దాల పాటు భారతీయ చలన చిత్ర పరిశ్రమను ఏలిన హీరోయిన్ శ్రీదేవి.  తెలుగు తమిళం హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో కూడా వందల చిత్రాల్లో నటించి ఏకంగా హీరోల రేంజ్ లో స్టార్డమ్ సంపాదించిన నటి శ్రీదేవి. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు ఏకంగా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి  ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.

 శ్రీదేవి దూరమైన తర్వాత ఇక ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ  కపూర్ లో శ్రీదేవిని చూసుకుంటున్నారు అభిమానులు. జాన్వికపూర్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతోంది.  ఇకపోతే అతిలోక సుందరి శ్రీదేవి నాకు రెండో తల్లి లాంటిది అని చెబుతోంది ఇక్కడ ఒక హీరోయిన్. గులాబీ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ప్రేక్షకులందరికీ దగ్గరయింది మహేశ్వరి. ఆ తర్వాత పెళ్లి సినిమాతో ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. అటు వెంటనే నీకోసం.. తిరుమల తిరుపతి వెంకటేశ లాంటి సినిమాలతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది మహేశ్వరి.

 ముఖ్యంగా తన హస్కీ వాయిస్ తో తెలుగు ప్రేక్షకులను మనసులను కొల్లగొట్టింది. అయితే ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన మహేశ్వరి ఏకంగా శ్రీదేవి తన రెండో తల్లి అంటూ చెప్పుకొచ్చింది. ఈటీవీ లో సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షోకి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది మహేశ్వరి.  దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. ఈ ప్రోమో చివర్లో..  శ్రీదేవి ని గుర్తు చేసుకున్నారు. ఇక శ్రీదేవితో మహేశ్వరి దిగిన ఫోటోలను చూపించగా.. మహేశ్వరి ఎమోషనల్ అవుతుంది.  శ్రీదేవి గారి తో మీకు ఉన్న బందం ఎలాంటిది అంటూ సుమ ప్రశ్నించగా.. శ్రీదేవి నా రెండో తల్లి లాంటిదని..  గొప్ప వ్యక్తి అంటూ మహేశ్వరి ఎమోషనల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: