సైలెంట్ గా "ఓటిటి" లోకి వచ్చేసిన "ఆ ఒకటి అడక్కు"... ఎక్కడో తెలుసా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ కొంత కాలం క్రితం ఆ ఒక్కటి అడక్కు అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి ఫెరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా ... మళ్లీ అంకం ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

నరేష్ చాలా సంవత్సరాల తర్వాత నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ మామూలు కలెక్షన్ లను మాత్రమే వసూలు చేయగలిగింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా ఎలాంటి హడా విడి లేకుండా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇకపోతే ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ సినిమాలో థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. మరి ఈ మూవీ ఓ టి  టి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

an

సంబంధిత వార్తలు: