కొవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పని పరిస్థితుల్లో గణనీయమైన మార్పులొచ్చిన సంగతి అందరికీ విదితమే. ఈ కరోనా వల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇకపోతే కొవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్క్ మస్ట్‌గా ధరించాల్సిన అవసరముందని నిపుణులు చెప్తున్నారు. దాంతో జనాలు ఇప్పటికీ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వైపు మొగ్గు చూపుతున్నారు.
కాగా, మాస్క్ ధారణపై కోలీవుడ్ బ్యూటి సంచలన కామెంట్స్ చేసింది.
తాము సినిమాలు షూటింగ్ చేస్తున్న సమయంలో కఠినమైన భద్రత ఉండేదని, ప్రతీ ఒక్రకు మాస్కు ధరించడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ పాటించేవారని తెలిపింది బ్యూటిఫుల్ హీరోయిన్ మాళవికా మోహనన్. ఈ క్రమంలోనే రెగ్యులర్‌గా మాస్కు ధరించడం అలవాటు అయిపోయిందని పేర్కొంది. ఒకవేళ సడెన్‌గా మస్క్ తీసెస్తే న్యూడ్‌గా ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుందని చెప్పింది. మాస్క్ అనే మన వస్త్రధారణలో ఒక భాగం అయిపోయిందని వివరించింది మాళవిక. ‘
ఖైదీ’ ఫేమ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘మాస్టర్’ ఫిల్మ్‌లో ఇళయ దళపతి విజయ్ సరసన నటించింది మాళవిక. ఈ చిత్రంలో తెలుగులోనూ ఓటీటీ వేదికగా విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అందాల భామ ధనుష్ నటిస్తున్న ‘మారన్’ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. కార్తీక్ నరేన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుపుకుంటున్నది.ఈ నేపథ్యంలోనే తాను హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న ‘హీరో’ ప్రాజెక్ట్ ఆగిపోయిందని పేర్కొంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కాల్సిన ప్రాజెక్టు ప్రస్తుతం ఆగిపోయింది. ప్రస్తుతం విజయ్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’లో నటిస్తున్నాడు. అయితే, త్వరలో తనను ఓ తెలుగు సినిమాలో చూడబోతున్నారు అని మాళవికా మోహన్ తెలిపింది.