టాలీవుడ్ లో టెక్నికల్ మ్యాజిక్..!
నాగ్ అశ్విన్ టాలెంట్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా 'మహానటి'. సావిత్రి బయోపిక్‌గా వచ్చిన ఈ సినిమాలో విజువల్స్ కూడా నాటి కాలాన్ని రిఫ్లెక్ట్ చేశాయనే ప్రశంషలు వచ్చాయి. ఈ కాంప్లిమెంట్స్‌కి కారణం స్పానిష్ కెమెరామెన్ డానీ సాంచెజ్ లోపెజ్. హిందీలో 'తమాన్ చే'కి వర్క్ చేసిన డానీ మహానటితో టాలీవుడ్‌కి వచ్చాడు. బ్లాక్ వైట్ డేస్‌ని కలర్‌ఫుల్‌గా చూపించి ప్రశంషలు అందుకున్నాడు.
డానీ వర్క్‌కి ఇంప్రెస్ అయిన నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమాకి కూడా ఇతన్నే రిపీట్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో వరల్డ్ క్లాస్ పిక్చర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి డానీ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడనే నమ్మకంతో ఉన్నాడు నాగీ. రీసెంట్‌గానే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక వేణు ఊడుగుల, రానా కాంబినేషన్‌లో రూపొందిన 'విరాటపర్వం'కి వర్క్ చేశాడు డానీ సాంచెజ్.
పొలెండ్‌కి, టాలీవుడ్‌కి లింక్ కలిపిన సినిమాటోగ్రాఫర్ మిరోస్లా బ్రోచెక్. పొలెండ్‌లో టీవీ సీరీసులు, మ్యూజిక్ వీడియోస్ డైరెక్ట్ చేసిన రైటర్ కమ్ సినిమాటోగ్రాఫర్ బ్రోచెక్, 'గ్యాంగ్ లీడర్'తో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు. ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ పాన్ ఇండియన్ మూవీ 'పుష్ప'కి కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు బ్రోచెక్.
అమెరికా నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన అడివి శేష్, అక్కడి నుంచి ఆలోచనలు మాత్రమే కాదు, టెక్నీషియన్స్‌ని కూడా తీసుకొస్తున్నాడు. 'క్షణం' సినిమాతో శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన కెమెరామెన్ షానీల్ డియోని టాలీవుడ్‌కి పట్టుకొచ్చాడు. ఇప్పటికే డియో తెలుగులో 'గూఢచారి, నిశ్శబ్ధం, వైల్డ్ డాగ్' సినిమాలకి వర్క్ చేశాడు.
మంచు విష్ణు మల్టీలింగ్వల్‌లో చేసిన సినిమా 'మోసగాళ్లు'. తెలుగు, ఇంగ్లీష్‌ల్లో రూపొందిన ఈ సినిమాకి అమెరికన్ సినిమాటోగ్రాఫర్ షేల్డన్ చా వర్క్ చేశాడు. హాలీవుడ్‌లో 'నైజీరియన్ ప్రిన్స్, సమ్మర్ నైట్'తో ప్రశంసలు అందుకున్నాడు షేల్డన్.