త్రివిక్రమ్‌తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న వెంకీ..?

Suma Kallamadi
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్3 మూవీ షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆయన కెరియర్ లో 74వది కాగా, ఆయన తన 75వ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. దృశ్యం 2, నారప్ప, ఎఫ్3 సినిమాల కంటే ఎక్కువగా వెంకటేష్ 75వ చిత్రం గురించే డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే విక్టరీ వెంకటేష్ తన 75వ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకోవాలని బాగా తపన పడుతున్నారట. అందుకే ఆయన టాప్ డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, వెంకటేష్ తన 75వ చిత్రాన్ని త్రివిక్రమ్ తో కలిసి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
కొద్ది రోజుల క్రితం వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మాట్లాడారని.. ఆయన కొన్ని డైలాగులు చెప్పారని.. కానీ అవి వెంకటేష్ కి నచ్చలేదని తెలుస్తోంది. వెంకటేష్ హీరోగా నటించిన మల్లేశ్వరి సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, డైలాగులు అందించారు. త్రివిక్రమ్ రాసిన డైలాగులను వెంకటేష్ చాలా ఫన్నీగా చెప్పి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. 2001 లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాకి కూడా త్రివిక్రమ్ కథ, డైలాగులు అందించారు. భూమిక, వెంకటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన వాసు సినిమాకి డైలాగ్స్ అందించారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో లో వచ్చిన సినిమాలలోని డైలాగులు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఆ సెంటిమెంట్ తోనే తన 75వ సినిమాకి త్రివిక్రమ్ ని డైరెక్టర్ గా, కథారచయితగా ఎంపిక చేసుకోవాలని వెంకటేష్ భావిస్తున్నారు. కానీ ఇటీవల త్రివిక్రమ్ వినిపించిన డైలాగులు వెంకటేష్ కి నచ్చలేదని సమాచారం.
ఒకవేళ వెంకటేష్ ని త్రివిక్రమ్ మెప్పించలేక పోతే ఆయన వేరే దర్శకుడితో కలిసి సినిమా చేసే అవకాశం ఉంది. కొరటాల శివ, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్ లతో ఆయన చర్చిస్తున్నారని కూడా తెలుస్తోంది. తన 75వ చిత్రం ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ కావాలని వెంకటేష్ భావిస్తున్నారని సమాచారం. ఏదిఏమైనా త్రివిక్రమ్, వెంకటేష్ కలసి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందిస్తే.. అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మరి వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తారో లేదో తెలియాలంటే కొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: