మోడీని తిట్టే వాళ్లకు నటుడు కోటా స్ట్రాంగ్ కౌంటర్ ?

Veldandi Saikiran
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోట శ్రీనివాసరావు గతంలో విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించగా... ఆ తర్వాత తండ్రి పాత్ర, తాతయ్య పాత్రల్లో కనిపించి అందరినీ కనువిందు చేశాడు. కోట నుంచి వెలువడే డైలాగులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. రాజకీయ నేపథ్యంలో ని సినిమాల్లో కోట శ్రీనివాసరావు నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పొలిటీషియన్ గా ఆయన నటన మరింత ప్రత్యేకంగా తెరపై కనిపిస్తూ ఉంటుంది. ప్రతిఘటన నుంచి మొదలయ్యే శత్రువు, గణేష్, లీడర్, చత్రపతి, మున్నా, అలాగే హిందీ మూవీల్లోనూ నటించి శభాష్ అనిపించారు. 


ఇదిలా ఉండగా తాజాగా ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని తిట్టిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. తాను మొదటి నుంచీ ఇప్పటి వరకూ భారతీయ జనతా పార్టీ లోనే ఉంటున్నట్లు..  ఇక ముందు కూడా ఆ పార్టీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు. బిజెపి పార్టీలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని... దానికి ఉదాహరణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని స్పష్టం చేశారు. మొదట్లో కిషన్ రెడ్డి హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో పని చేసే వాడిని... అలాంటిది  ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా... ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఎదిగారని చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు.


దీనికి కారణం... ఒక బీజేపీ పార్టీనే కారణమని..  పార్టీలో కష్టపడ్డ వారికి ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుందని వెల్లడించారు. ఇటీవల గవర్నర్ గా నియామకమైన హరిబాబు కూడా పార్టీలో చాలా కష్టపడ్డాడని.. అందుకే బీజేపీ అధిష్టానం అతనికి గొప్ప పదవి ఇచ్చింది అని స్పష్టం చేశారు. ఇక కరోనా సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ లేకపోతే.. దేశ పరిస్థితి దారుణంగా ఉండేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా మోడీ ఉండబట్టే కరోనా ను దీటు గా ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. మోడీని విమర్శించే వారికి... పని-పాట లేదని..  ఏదో కావాలని అలా విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: