కీర్తి సినిమాని మూలనపెట్టేసారేంటి..?

Suma Kallamadi
మహా నటి సినిమాతో కీర్తి సురేష్ పేరు ఒక్కసారిగా బాగా పాపులర్ అయిపొయింది.ఆ సినిమాలో కీర్తి నటన అమోఘం అనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది.అలా నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో గుడ్ లక్ సఖి సినిమా కూడా ఒకటి.  ఇప్పుడు తాజాగా కీర్తి సురేష్ నటించిన ఈ ‘గుడ్ లక్ సఖి’ సినిమాకి అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయని చెప్పాలి. పోయిన సంవత్సరమే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామంటూ తెగ హడావుడి చేసారు.కానీ లాక్ డౌన్ వలన ఈ సినిమా రిలీజ్ కాస్త వాయిదా పడింది.అప్పటి నుండి ఇప్పటివరకు దగ్గర దగ్గర ఏడాది కాలం పూర్తి అయింది.మళ్ళీ ఉన్నటుండి ఒక రెండు నెలల క్రితం ఈ సినిమాకు సంబందించిన ఒక అప్ డేట్ రిలీజ్ చేసారు.
జూన్ 4 వ తారీఖున ఈ సినిమాను రిలీజ్ చేస్తామని  కొత్త డేట్ ప్రకటించారు. కానీ మళ్ళీ విడుదలకు నోచుకోలేదు. మరోసారి లాక్ డౌన్ వచ్చి పడింది. మళ్ళీ రెండోసారి కూడా సినిమా వాయిదా పడింది.కానీ ఈ సినిమా నిర్మాతలు మాత్రం తమకు ఏమి పట్టనట్లు మరో అప్ డేట్ ఇవ్వలేదు.ఈ సినిమాప్ పోస్ట‌ర్, టీజ‌ర్ మిన‌హా ఈ మూవీ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్ లేదు. దీనితో అభిమానులు సైతం నిరాశకు గురయ్యారు. అసలు గుడ్ లక్ సఖి సినిమా రిలీజ్ అవుతుందా.? లేదా అనే అనుమానం అభిమానుల్లో ఎక్కువ అవుతుంది.అసలు ఇలాంటి సమయంలో ఈ సినిమాని డైరెక్ట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అయిన ఓటిటిలో రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు ఎందుకు భావించడం లేదు అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది.

గతేడాది కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్,  మిస్ ఇండియా సినిమాలు రెండు కూడా డైరెక్ట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లోనే రిలీజ్ అయ్యాయి. కానీ అ రెండు సినిమాలు కూడా అనుకున్నంత విజయాన్ని సాదించాలేదు. అ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకునేమో మరి ఈ సారి కీర్తి నటించిన గుడ్ లక్ సఖి సినిమాను ఓటిటీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తుంది. ఈ సినిమాకు నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. తెలుగులో నగేష్ తీసిన మొదటి సినిమా ఇదే అవ్వడం విశేషం. బ్యాడ్ ల‌క్ అని ముద్ర వేసుకున్న ఓ అమ్మాయి ఎలా నేష‌న‌ల్ ఛాంపియ‌న్‌గా ఎదిగింది.అన్న ఒక డిఫరెంట్ స్టోరీతో  ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇందులో కీర్తి సురేష్‌ తో పాటు జ‌గ‌ప‌తి బాబు, ఆది, ర‌మా ప్ర‌భ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.ఈ మూవీకి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: