ఎంజెలినాకు కోర్టులో చుక్కెదురు.. ?

Suma Kallamadi
హాలీవుడ్ న‌టి ఎంజెలీనా జోలి గ‌త ఐదేళ్లుగా సాగిస్తున్న పోరాటంలో ఓడిపోయింది. త‌న పిల్ల‌ల సంర‌క్ష‌ణ విష‌యంలో భ‌ర్త‌తో చేస్తున్న పోరాటంలో త‌న‌కు వ్య‌తిరేకంగా తీర్పు వ‌చ్చింది దీంతో తాను తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. జ‌డ్జి త‌న భ‌ర్త‌కు అమ్ముడుపోయిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఇప్పుడు వీరి వివాదం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
2005లో మిస్టర్ అండ్ మిస్సెస్ సినిమా ద్వారా ఎంజెలినా, బ్రాడ్‌పిట్ ద‌గ్గ‌ర‌య్యారు. అప్ప‌టి నుంచి చాలా ఏళ్లు డేటింగ్ లో ఉన్నారు వీరు. కాగా ఈ క్ర‌మంలో వీరికి ఆరుగురు పిల్ల‌లు పుట్టారు. 2014లో పెళ్లి చేసుకోగా.. వివాదాల కార‌ణంగా రెండేళ్లకే ఈ జంట విడాకుల కోసం కోర్టుకు వెళ్లింది. 2019 ఏప్రిల్ నుంచి తాము విడిగా ఉంటున్నట్లు ప్రకటించుకుంది. అయితే అప్ప‌టి నుంచి వీరి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది.

 

ఇక పిల్లల బాధ్యతను తానే చూసుకుంటానంటూ ఎంజెలినా పిటిష‌న్ దాఖ‌లు చేసింది. కాగా కేసు పెండింగ్ ఉండ‌టంతో పిల్ల‌ల బాధ్య‌త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్దరూ క‌లిసి చూసుకుంటున్నారు. ఇప్పుడు ఐదుగురు పిల్లల సంరక్షణను బ్రాడ్పిట్(57)తో కలిసి పంచుకోవాలని ఎంజెలీనా జోలిని జడ్జి ఆదేశించారు. అయితే పెద్దవాడైన మాడోక్స్ కస్టడీ గురించి మాత్రం ఎటూ చెప్ప‌లేదు కోర్టు. ఈ విష‌యంలో ఎంజెలినాకు ఎదురు దెబ్బ త‌గిలింది.

 

వీటికి ఒప్పుకుంటే వీరికి విడాకులు మంజూరు చేస్తామ‌ని జ‌డ్జి వివ‌రించారు. ఇక కోర్టులో వాదప్రతివాదనల కోసం జాన్ అవుడర్కిరిక్ అనే ప్రైవేట్ జడ్జ్ను నియమించారు. 2014 వీళ్ల పెళ్లికి అధికారిక ముద్ర వేసింది కూడా జడ్జినే. ఇప్పుడు వీరిద్ద‌రి మ‌ధ్య ఇన్నేళ్లుగా సాగిన కేసులో చివ‌రికు బ్రాడ్‌పిట్‌కు అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. దీంతో ఎంజెలినా తీర్పును స‌వాలు చేస్తూ రీ పిటిషన్ వెళ్లాలనుకుంటోంది. మ‌రి ఆమెకు అనుకూలంగా ఏమైనా తీర్పు వ‌స్తుందో లేదో చూడాలి. కాగా వీరి వివాదం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: