సింహా తో సింహం లా గర్జించిన బాలయ్య .... !!
అయితే అదే సమయంలో తొలిసారిగా బాలయ్యతో సింహా అనే యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తీశారు బోయపాటి శ్రీను. నయనతార, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని పరుచూరి కిరీటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకి దివంగత సంగీత దర్శకుడు చక్రి సంగీతం అందించగా చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. వృత్తి రీత్యా డాక్టర్ అయినప్పటికీ కూడా శ్రీమన్నారాయణ అనే వైద్యుడు తమ ప్రాంతంలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని ఎదిరించి వారి దురాగతాలను అరికట్టి చివరికి వారి చేతిలోనే హతమవుతాడు. ఆ తరువాత అతడి తనయుడైన లెక్చరర్ నరసింహా కొన్నేళ్ల అనంతరం తన తండ్రి జీవితం గురించి తెలుసుకుని ఆయనని హతమార్చిన వారిని ఎలా అంతం చేసాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ థీమ్.
అయితే ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఎంతో అద్భుతంగా తెరకెక్కించి అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు బోయపాటి. అలానే బాలయ్య రెండు పాత్రల్లో తన అద్వితీయ నటనతో ప్రేక్షకాభిమానులను అలరించారు. ఇక కలెక్షన్స్ పరంగా అదరగొట్టిన ఈ సినిమా అటు అవార్డుల పరంగా రాష్ట్రప్రభుత్వం అందించే నంది పురస్కారాల్లో మూడు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా బాలయ్య, ఉత్తమ సంగీత దర్శకుడిగా చక్రి, అలానే ఉత్తమ లేడీ కమెడియన్ గా ఝాన్సీ అవార్డులు దక్కించుకున్నారు. అలానే పలు ఇతర అవార్డులని సైతం ఈ సినిమా సొంతం చేసుకోవడం విశేషం ..... !!