నాగార్జున సంపాదించిన ఆస్తి ఎంతో తెలుసా.. ?
అయితే నాగార్జునకు తండ్రి ఏఎన్నార్ నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులతో పాటు తాను సినిమాల్లో నటించిన ఆస్తుల విలువే కోట్లలో ఉంది. అన్నింటికి మించి నాగార్జున రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయన హైదరాబాద్, అమరావతి, విజయవాడ, వైజాగ్, చెన్నై, బెంగళూరు రియల్ ఎస్టేట్‌లో కూడా భారీ పెట్టుబడులు పెట్టారన్న టాక్ ఉంది. ఆయన ఆస్తులు చూస్తే కళ్లు జిగేల్ మనేలా, మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటాయి.
ఇక ఇప్పుడు టాలీవుడ్లో రిచ్చెస్ట్ పర్సన్స్‌లో నాగార్జున ఒకడు. 2019 లెక్కల ప్రకారం ఆయన నికర ఆస్తులు 850 కోట్ల రూపాయలు. ఏడాదికి రూ.30కోట్ల వార్షికాదాయంతో కింగ్ ఇన్నేళ్లలో ఎంతో క్రమశిక్షణతో కూడబెట్టిన ఆస్తులివి. హైదరాబాద్ లో ఆయన నివశించే బంగ్లా ఖరీదు రూ.43 కోట్లు ఉంటుందని అంచనా. ఇంటి గ్యారేజ్ లో ఖరీదైన కార్లకు కొదవేం లేదు. రేంజ్ రోవర్ ఎవోక్ -65 లక్షలు ఆడి ఏ7- 1.02కోట్లు బీఎండబ్ల్యూ 7 సిరీస్- 1.32 కోట్లు మెర్సిడెస్ ఎస్ క్లాస్ -3కోట్లు విలువను కలిగి ఉన్నాయి.
అంతేకాదు పలు రకాల స్పోర్ట్స్ గూడ్స్ గాడ్జెట్స్ విలువ కోట్లలోనే ఉంటుందిట. ఇక హైదరాబాద్ లోని ఖరీదైన ప్రైమ్ ఏరియాలో ఉన్న ఎన్- కన్వెన్షన్ కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. నగరంలో పలు చోట్ల పబ్స్ ఖరీదైన రెస్టారెంట్స్ కమర్షియల్ కాంప్లెక్సులు నాగార్జున రన్ చేస్తున్నారు. వీటన్నిటి నుంచి వార్షికాదాయం అసాధారణంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.