పూజా హెగ్డేకి అన్ని కోట్ల పారితోషికం ఇచ్చేందుకు రెడీ అయిన త్రివిక్రమ్..?

Suma Kallamadi
కరోనా ను జయించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సినిమా పనుల్లో నిమగ్నమయ్యారు. గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలిచిన త్రివిక్రమ్ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకొని మళ్ళీ వార్తలకెక్కారు. ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి సినిమా చేస్తారని అందరూ భావించారు కానీ ఆ ప్రాజెక్టు అనూహ్యంగా ఆగిపోయింది. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు 28వ సినిమా షూటింగ్ ప్రారంభించారు.
అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఎంపిక చేసుకోవాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావిస్తున్నారు. ఇంతకుముందు తను డైరెక్ట్ చేసిన అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో త్రివిక్రమ్ పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. అయితే ఇప్పుడు కూడా తన తదుపరి సినిమాకి పూజ హెగ్డే ని త్రివిక్రమ్ శ్రీనివాస్ సంప్రదించినట్టు సమాచారం. మహేష్ బాబు కూడా పూజా హిట్ తో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పూజా హెగ్డే ఒక్కో సినిమాకి మూడు కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారు.

బాలీవుడ్, కోలీవుడ్ వంటి ఇండస్ట్రీల నుంచి ఆమెకు భారీ అవకాశాలు వస్తున్నాయి. కానీ అవన్నీ కాదని తెలుగులో ఆమె నటించడానికి అంగీకరిస్తారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఆమెకున్న డిమాండ్ ని బట్టి ఆమెకు తగిన రెమ్యూనరేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెకు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ రెమ్యూనరేషన్ అందించేందుకు సిద్ధపడ్డారని తెలుస్తోంది. సినీ వర్గాల ప్రకారం ఆమెకు రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చేందుకు మహేష్ బాబు చిత్రం అయితే చాలా బిజీగా ఉన్నా కూడా పూజా హెగ్డే తన డేట్స్ ని త్రివిక్రమ్ సినిమాకి కేటాయించారని టాక్. ఇకపోతే అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలసి మూడవ సినిమా చేయబోతున్నారు. కాగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: