బ్రేకింగ్: 'ఆర్ఆర్ఆర్' నుండి ఆరోజున మరొక అప్ డేట్ .... సిద్దమేనా ....??

GVK Writings
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలానే అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్, టీజర్, ట్రైలర్ వంటివి విడుదల కానుండటంతో ఫ్యాన్స్ లో ఈ మూవీ పై మరింత ఆసక్తి రేకెత్తుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తోపాటు హీరోలిద్దరి ఫస్ట్ లుక్ టీజర్లు కూడా అందరినీ ఆకట్టుకోవడంతో పాటు వారిలో సినిమా పై భారీస్థాయిలో అంచనాలను క్రియేట్ చేశాయి. తొలిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా నటిస్తుండగా శ్రియ శరన్, సముద్రఖని, అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు.
మరోవైపు పలువురు బాలీవుడ్ నటులు కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి సెంథిల్కుమార్ ఫోటోగ్రఫీని అందిస్తుండగా సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన అజయ్ దేవగన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి నుంచి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. బాహుబలి రెండు సినిమా ల అద్భుత విజయాలు తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇంత భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయని అలానే ఆయన అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఎంతో జాగ్రత్తగా ఆర్ఆర్ఆర్ మూవీని తెరకెక్కిస్తున్నారని ఈ ఏడాది అక్టోబర్ 13న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సరికొత్త సంచలన రికార్డ్స్ సృష్టించడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మూవీ నుండి ఈ నెల 26వ తేదీన మరొకసారి అప్డేట్ రానుంది అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్న సముద్రఖని పుట్టిన రోజు ఆ రోజు కావడంతో ఆయన యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిందట యూనిట్. అలాగే అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక న్యూస్ కూడా బయటకు రానుందట. మొత్తంగా రోజురోజుకీ అందరిలోనూ భారీ స్థాయి అంచనాలు పెంచుకుంటూ పోతున్నా ఈ మూవీ రిలీజ్ తర్వాత ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి అంటున్నారు విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: