సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : కొత్త వాళ్లతో అనుకున్న సినిమాలోకి స్టార్ హీరోలు ఎలా వచ్చారు..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు , విక్టరీ వెంకటేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. తాజాగా నిర్మాత దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా స్టార్ట్ కావడానికి ముందు జరిగిన కొన్ని పరిణామాల గురించి ఆయన చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు మాట్లాడుతూ ... మా బ్యానర్లో శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారు లోకం సినిమా చేశాడు. ఆ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఆయన ఒక రోజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంబంధించిన కథను విపరిచాడు. నాకు అది బాగా నచ్చింది. దానితో ఎవరితో చేయాలి అనుకుంటున్నావు అని అడిగాను. నేను అంతా కొత్త వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. దానితో నేను అంతా కొత్త వాళ్ళతో వద్దు ఈ సినిమాను స్టార్ హీరోలతో చేద్దాం అని నేను అన్నాను. దానితో ఆయన వెంకటేష్ గారికి ఈ కథ తెలుసు.

ఆయన ఈ సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నారు అని శ్రీకాంత్ నాకు చెప్పాడు. దానితో నేను పవన్ కళ్యాణ్ తో మరో క్యారెక్టర్ చేయించడానికి ప్రయత్నిద్దాం అని అన్నాను. ఇక పవన్ కళ్యాణ్ ను కలవక ముందే ఒక రోజు అనుకోకుండా మహేష్ బాబు ను కలవడం , ఈ స్టోరీ గురించి చెప్పడంతో వెంకటేష్ గారు చేస్తే నేను కచ్చితంగా సినిమా చేస్తాను అని మహేష్ అన్నాడు. దానితో ఇద్దరు ఒప్పుకున్నారు. అలా అంతా కొత్త వాళ్ళతో అనుకున్న ఈ సినిమాలోకి ఇద్దరు స్టార్ హీరోలు వచ్చారు అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: