నందమూరి బిడ్డ మజాకా.. బొమ్మ పడకముందే.. దర్శక నిర్మాతలు క్యూ..!
ఇదే క్రమం లో మోక్షజ్ఞ టాలీవుడ్ లో అడుగు పెట్టకా ముందే ఆయన తో వరుసగా సినిమాలు చేసేందుకు దర్శక - నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .. అలాగే త్వరలో నే బాలకృష్ణ తన వారసుడు కోసం మెగా ఫోన్ పట్టి ఆదిత్య 999 మ్యాక్స్ తీయడాని కి రంగం సిద్ధం చేస్తున్నాడు .. ఇవే కాకుండా మరికొన్ని సినిమాల కోసం కూడా సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి . టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ మోక్షజ్ఞ , వెంకీ అట్లూరి కాంబో లో ఓ సినిమా అను నిర్మించనుంది .. నిర్మాత నాగ వంశి అధికారకం గా ఈ విషయాన్ని ప్రకటించారు ..
ఇదే క్రమంలో బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమా తెర్కక్కిస్తున్న దర్శకుడు బాబి కూడా మోక్షజ్ఞతో సినిమాపై అదిరిపోయే కామెంట్లు చేశాడు .. మోక్షజ్ఞతో తనకు సినిమా చేసే అవకాశం వస్తే ఎప్పటికీ వదులుకోను అంటూ బాబి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .. బాబి లాంటి మాస్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినిమా పడితే కచ్చితంగా మాస్ ప్రేక్షకులకు మంచి పండగల అవుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా మొత్తంగా 2025 లో మోక్షజ్ఞ వెండి తెర పై సందడి చేయడమే కాకుండా కొత్త కొత్త సినిమాల ని లైన్లో పెట్టే అవకాశాలు ఎక్కువ గా కనిపిస్తున్నాయి .