ఈ ఏడాదికి ఇంతే.. మంత్రి వర్గ విస్తరణ లేనే లేదు.. !
దీంతో అప్పటికే కొద్దిపాటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుల విషయంలో సీఎం చంద్రబాబు సీరియస్ అవుతారని.. వారిని పక్కన పెడతారని.. కాబట్టి తమకు అవకాశాలు తగ్గుతాయని రాష్ట్రవ్యాప్తంగా చాలామంది సీనియర్ నాయకులు అదేవిధంగా తొలిసారి ఎన్నికైన నేతలు కూడా భావించారు. కానీ, అనూహ్యంగా వారి ఆశలైతే ఫలించలేదని చెప్పాలి. వచ్చే ఏడాది అయినా ఉంటుందా ఉండదా అనే విషయాన్ని ఇప్పుడు చెప్పలేకపోయినప్పటికీ ప్రస్తుతం అయితే నాయకులు చాలామంది ఈ వ్యవహారంపై ఆశలు పెట్టుకున్నారు.
గతంలో ఎన్నికల సమయంలో పార్టీకి బలంగా పనిచేసిన వారు, టికెట్లు త్యాగం చేసి పార్టీకి సహకరించిన వారు కూడా పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకునే వారు కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు. అయితే వీరి అసలు పెద్దగా ఫలించలేదు. మరి వచ్చే ఏడాదైనా ఫలిస్తాయో లేదో చూడాలి. ఇప్పటికైతే సీఎం చంద్రబాబు మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలు లేదని సమాచారం. ఒకవేళ ఎవరినైనా పక్కన పెట్టాల్సి వచ్చినా ఆచితూచి అడుగులు వేస్తారే తప్ప సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేసే అవకాశం లేదు.
ప్రస్తుతం రెండో సంవత్సరం జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే నామినేటెడ్ పదవులు విషయంలో మాత్రం సీఎం చంద్రబాబు దూకుడుగానే ఉన్నారు. సాధ్యమైనన్ని పదవులు ఇస్తూనే ఉన్నారు. మరింత మందికి ఇస్తామని కూడా చెబుతున్నారు. సో మొత్తానికి ఈ ఏడాది మంత్రి పదవులు ఆశించిన వారికి మాత్రం ఎదురుచూపులు తప్ప లేదనే చెప్పాలి.